AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబ్బాక దుక్కుల్లోకి కాళేశ్వరం జలాలు..!

తెలంగాణ జలభాండాగారం కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు సిద్ధిపేట జిల్లా దుబ్బాకను తాకనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కొండపోచమ్మ ప్రాజెక్టులోకి చేరనున్న గోదావరి జలాలు జిల్లా వ్యాప్తంగా అందించేందుక రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ లో కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలోని డిస్ట్రిబ్యూటరీ-1, 6 ఆర్ కాలువ నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దాదాపు 170 కిలో మీటర్ల ప్రయాణం తర్వాత […]

దుబ్బాక దుక్కుల్లోకి కాళేశ్వరం జలాలు..!
Balaraju Goud
|

Updated on: Oct 18, 2020 | 6:53 PM

Share

తెలంగాణ జలభాండాగారం కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు సిద్ధిపేట జిల్లా దుబ్బాకను తాకనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కొండపోచమ్మ ప్రాజెక్టులోకి చేరనున్న గోదావరి జలాలు జిల్లా వ్యాప్తంగా అందించేందుక రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ లో కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలోని డిస్ట్రిబ్యూటరీ-1, 6 ఆర్ కాలువ నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దాదాపు 170 కిలో మీటర్ల ప్రయాణం తర్వాత గోదావరి జలాలు దుబ్బాక ప్రాంతానికి చేరుకోనున్నాయి. సిద్ధిపేట రూరల్, దుబ్బాక, ముస్తాబాద్ మూడు మండలాలు మీదుగా 8 గ్రామాల్లో ఈ కాలువ ప్రవహించనుంది. ఈ వాన కాలంలోపే సిద్ధిపేట్ ప్రాంత చెరువులు నింపుకొని రైతులు రెండు పంటలు పండించుకోవాలన్నదే సీఏం కేసీఆర్ ఆశయమన్నారు మంత్రి హరీష్ రావు. ఇందుకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి పనులు వేగవంతం చేసేందుకు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. కాలువ నిర్మాణాలకు రైతులందరూ ఆయా ప్రాంత చెరువులు నింపుకోవాలని, ఈ ప్రాంతానికి నీళ్లు అందించేందుకు సహకరించాలని రైతులను కోరారు. ప్రభుత్వం ప్రతి రైతుకు సాయం అందిస్తుందని, చట్ట ప్రకారంగా రావాల్సిన ప్రతి పైసా రైతులకు త్వరితగతిన చెల్లిస్తామని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు.

పెద్దగుండవెళ్లి కాలువ ప్రధానమైన కాలువతో పాటు హసన్ మీరాపూర్, చింతమడక, అంకంపేట, నారాయణరావుపేట గ్రామాల్లో పారే కాలువ పనులను మొదలయ్యాయి. హసన్ మీరాపూర్, పెద్ద గుండవెళ్లి చౌద చెరువు, దుంపలపల్లి పెద్ద చెరువు, దుబ్బాకలోని నల్ల చెరువు, రామ సముద్రం, ధర్మాజీపేటలోని పెద్ద చెరువు, చిట్టాపూర్ పెద్ద చెరువులను ప్రధానమైన పెద్ద చెరువులన్నీ ఈ కాలువ ద్వారా నిండనున్నాయి. హసన్ మీరాపూర్, పెద్ద గుండవెళ్లి, చింత మడక, మాచాపూర్, చెల్లాపూర్, రాజక్కపేట, ముస్తాబాద్ మండలం బదనకల్, మోయిని కుంట గ్రామాల్లోని 13 వేల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

Follow Us
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!