సచిన్ vs కోహ్లీ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఆటగాడు? రికీ పాంటింగ్ ఇచ్చిన సమాధానం ఇది..

తాను కలిసి ఆడిన వారిలో సాంకేతికంగా సచిన్ టెండుల్కర్ అత్యుత్తమ బ్యాటర్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. బౌలింగ్‌లో ఎలాంటి పక్కా వ్యూహాలతో బరిలోకి దిగినా.. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సమర్థుడు సచిన్ అంటూ కొనియాడారు.

సచిన్ vs కోహ్లీ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ ఆటగాడు? రికీ పాంటింగ్ ఇచ్చిన సమాధానం ఇది..
Virat Kohli vs Sachin Tendulkar

Updated on: Apr 24, 2023 | 3:25 PM

క్రికెట్ దేవుడుగా చాలా మంది అభిమానులు సచిన్ టెండుల్కర్‌ను ఆరాధిస్తారు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ సచిన్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. పరుగుల మిషన్‌గా గుర్తింపు సాధించిన కింగ్ కోహ్లీకి కూడా కోట్లాది మంది క్రికెట్ అభిమానులున్నారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్? క్రీడా ప్రపంచంలో తరచూ దీనిపై చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇదే ప్రశ్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు ఎదురయ్యింది. దీనిపై స్పందించిన రికీ.. తాను కలిసి ఆడిన వారిలో సాంకేతికంగా సచిన్ టెండుల్కర్ అత్యుత్తమ బ్యాటర్‌గా అభిప్రాయపడ్డారు. బౌలింగ్‌లో ఎలాంటి పక్కా వ్యూహాలతో బరిలోకి దిగినా.. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సమర్థుడు సచిన్ అంటూ కొనియాడారు. అందుకే తన తరంలో.. తాను కలిసి ఆడిన ప్రత్యర్థి ఆటగాళ్లలో సచిన్ అందరికంటే బెస్ట్ బ్యాటర్ సచినే అన్నారు. సచిన్ టెండుల్కర్ 50వ జన్మదినం సందర్భంగా ఐసీసీ రివ్యూలో పాంటింగ్ ఈ కామెంట్స్ చేశారు.

సచిన్ టెండుల్కర్‌తో కోహ్లీని పోల్చేందుకు రికీ తిరస్కరించారు. కోహ్లీకి ఇంకా చాలా సమయం ఉందన్నారు. కోహ్లీ రిటైర్ అయ్యాకే అతణ్ని సచిన్ టెండుల్కర్‌తో పోల్చుతానని అన్నారు. కోహ్లీ రిటైర్ అయ్యాక సచిన్‌తో పోల్చడమే సమంజసంగా ఉంటుందన్నారు. సచిన్ కాలంనాటికి ఇప్పుడు కోహ్లీ కాలానికి క్రికెట్ నిబంధనల్లో చాలా మార్పులు వచ్చాయని రికీ గుర్తుచేశారు. గతంతో పోల్చితే ఇప్పుడు బ్యాటింగ్ చేయడం ఈజీగా అభిప్రాయపడ్డారు. కోహ్లీ మంచి బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

రికీ పాంటింగ్ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.. 

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి..