Sachin Tendulkar: టీమిండియా వెటెరన్ స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్ళకు నిరంతరం కరోనా పరీక్ష చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచిన్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అయితే, కరోనా టెస్ట్‌లు చేస్తున్న వైద్య అధికారులను సచిన్ టెండూల్కర్ కాస్త ఆటపట్టించాడు. దాంతో అంతా నవ్వుకున్నారు. ఈ ఘటన తాలూకు వీడియోను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా తెగ వైరల్ అవుతోంది.
రోడ్ సేఫ్టీ సిరీస్‌లో ఇండియన్ లెజెండ్స్ తరపున సచిన్ టెండూల్కర్ ఆడుతున్నారు. వీరితో పాటు యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ వంటి ఆటగాళ్ళు కూడా ఈ జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ఇండియన్ లెజెండ్స్ జట్టు విజయం సాధించగా.. రెండో మ్యాచ్ ఇవాళ జరిగింది. అయితే రెండో మ్యాచ్ నేపథ్యంలో టీమ్ సభ్యులందరికీ కరోనా టెస్ట్ చేయించారు నిర్వాహకులు. ఆ సందర్భంగా సచిన్ టెండూల్కర్‌ను వైద్యులు సీట్‌పై కూర్చొబెట్టి నోస్(ముక్కు) నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే, అప్పటికే ప్రాంక్ చేయాలని డిసైడ్ అయిన సచిన్ టెండూల్కర్.. వైద్యుడి వైపు ముఖం తిప్పి గట్టిగా తుమ్మబోయాడు. అది గమనించిన వైద్యుడు హడలిపోయాడు. అంతలోనే సచిన్ నవ్వుతూ డాక్టర్ వైపు చూశాడు. దాంతో సదరు డాక్టర్ సచిన్ ఉద్దేశాన్ని గమనించి తాను కూడా నవ్వుకున్నాడు. ఈ ఘటన తాలూకు వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన సచిన్ టెండూల్కర్.. ‘నేను 200 టెస్ట్‌లు ఆడాడు.. 277 కోవిడ్ టెస్టులు చేయించుకున్నాను. సరదా కోసం చిన్న ప్రాంక్ చేశాను. మేం ఇక్కడ ఆడేందుకు సహకరిస్తున్న వైద్య బృందానికి ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు.
ఇదిలాఉంటే.. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మార్చి 5 న జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ అద్భుతమైన ఆట తీరుతో బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్, సచిన్ ఆడిత తీరు నాటి రోజులను గుర్తు చేసింది. ముఖ్యంగా సెహ్వాగ్ కేవలం 35 బంతుల్లో 80 పరుగుల చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టెండూల్కర్ 35 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో అద్భుతమైన షాట్లతో పాత రోజులను గుర్తుచేశాడు. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఇండియన్ లెజెంట్స్ టీమ్ తలపడుతోంది.
Sachin Tendulkar Insta Post:
Also read:
Visakha Steel Plant: అదే జరిగితే రాజీనామాకు సిద్ధం.. సంచలన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి..