చరిత్ర లిఖించిన జడేజా…అరుదైన రికార్డు కైవసం

|

Feb 09, 2020 | 5:23 PM

కివీస్‌తో  జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌ను ఇండియా చేజార్చుకున్న విషయం తెలిసిందే. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ వరసగా రెండు వన్డేలు గెలిచి.. విజయ బావుటా ఎగరవేసింది. రెండో వన్డేలో భారత్‌ను గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసిన ర‌వీంద్ర జ‌డేజా (55, 75 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ ) హాఫ్ సెంచరీ కూడా వృథా అయ్యింది. అయితే ఈ అర్ధ సెంచరీతో జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత లెజండ్రీ మాజీ కెప్టెన్లు.. ధోనీ, […]

చరిత్ర లిఖించిన జడేజా...అరుదైన రికార్డు కైవసం
Follow us on

కివీస్‌తో  జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌ను ఇండియా చేజార్చుకున్న విషయం తెలిసిందే. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ వరసగా రెండు వన్డేలు గెలిచి.. విజయ బావుటా ఎగరవేసింది. రెండో వన్డేలో భారత్‌ను గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసిన ర‌వీంద్ర జ‌డేజా (55, 75 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ ) హాఫ్ సెంచరీ కూడా వృథా అయ్యింది. అయితే ఈ అర్ధ సెంచరీతో జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత లెజండ్రీ మాజీ కెప్టెన్లు.. ధోనీ, క‌పిల్ దేవ్‌‌లను సైతం క్రాస్ చేసి..ఎక్కువ అర్దసెంచరీలు చేసిన 7వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు జడేజా ఈ స్థానంలో 77 సార్లు బరిలోకి దిగి 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.  వీటిలో 26 సార్లు నాటౌట్‌గా నిలవడం విశేషం. 83.70 స్రైక్ రేటుతో 7వ స్థానంలో 1520 పరుగులు చేశాడు జడ్డూ. కివీస్‌తో రెండో వన్డే ముందు వరకు ఆరేసి అర్ధసెంచరీలతో క‌పిల్ దేవ్, ధోనీలు సమానంగా ఈ రికార్డును షేర్ చేసుకున్నారు.