
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ రషీద్ ఖాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. గతకొంతకాలగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడి తల్లి గురువారం మరణంచారు. ఈ శాడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకుంటూ ట్విటర్‌లో రషీద్ ఖాన్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘అమ్మా.. నువ్వే నా ధ్యాస, శ్వాస. నీవు లేకుండా నేను లేను. నువ్వు ఇక నాతో ఉండవనే విషయం వేధిస్తోంది. నీ దూరంతో చాలా కోల్పోతున్నానమ్మ. నీ ఆత్మకు శాంతికలగాలి’ అంటూ రషీద్ తన బాధను వ్యక్తపరిచాడు.
కాగా తన తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నదని.. ఆమె కోలుకునేందుకు ప్రేయర్స్ చేయాలని అభిమానులకు, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తూ ఇటీవల రషీద్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రషీద్ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు… సామాజిక మాధ్యమాల ద్వారా అతడిని ఓదారుస్తున్నారు. ఐపీఎల్ లో అద్బుత ఆటతీరుతో తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ అభిమానులను సొంతం చేసుకున్నాడు రషీద్.
إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُوْنَ
You were my home my mother I had no home but you . i can’t believe you are no more with me you will missed forever . Rest In Peace #MOTHER ??— Rashid Khan (@rashidkhan_19) June 18, 2020