
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటన కోసం టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో పృథ్వీ షాకు అవకాశం లభించలేదు. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లు ఆడనున్న భారత్, అదే జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బంగ్లాదేశ్ తో మూడు వన్డే మ్యాచ్ లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ రెండు పర్యటనల కోసం ఎంపిక చేసిన జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందిస్తూ.. ప్రతి ఆటగాడిపై పర్యవేక్షణ ఉంటుందని, భవిష్యత్తులో అతనికి అవకాశం లభిస్తుందని తెలిపారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించిన కొద్ది నిమిషాలకే పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో క్రిప్టిక్ నోట్‌ను పోస్ట్ చేశాడు. సాయిబాబా ఫోటోతో అంతా సాయిబాబా చూస్తున్నారని ఆశిస్తున్నానని క్యాప్షన్ ఇచ్చాడు. కివీస్, బంగ్లాదేశ్ తో జరిగే టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ లో తనకు అవకాశం దక్కని తర్వాత పృథ్వీషా రియాక్షన్ ట్రెండింగ్ అవుతోంది.
ఈ అంశంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జట్టులో ఉండి మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. అయితే పృథ్వీ షా భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు పొందుతాడని చేతన్ శర్మ స్పష్టం చేశాడు. పృథ్వీ షాతో బీసీసీఐ టచ్ లో ఉందని, అతడు ఫిట్ గానే ఉన్నట్లు తెలిపారు. పృథ్వీ షా ను ఎంపిక చేయకపోవడంపై ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవని, జట్టులో ఎంపికైన ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తున్నారా లేదా అనేది మాత్రమే చూడాలన్నారు.
మంచి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తప్పకుండా అవకాశాలు వస్తాయని తెలిపారు. అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించబడుతున్న పృథ్వీ షా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో దేనికి ఎంపిక కాలేదు. స్క్వాడ్ ప్రకటన తరువాత పృథ్వీ షా స్పష్టంగా భావోద్వేగానికి గురైనట్లు అతని ఇన్‌స్టాగ్రామ్ లో క్రిప్టిక్ నోట్ పోస్టు ద్వారా తెలుస్తోంది.
The Instagram story of Prithvi Shaw. pic.twitter.com/wAT0vRp3vQ
— Johns. (@CricCrazyJohns) October 31, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం చూడండి..