పారిస్ ఒలింపిక్స్ లో పతకాల కోసం భారత్ ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటి వరకూ షూటింగ్ లో వచ్చిన మూడు కాంస్యాలు మినహా మరొక పతకం దక్కలేదు. పతకాలు తెస్తారని ఆశాపెట్టుకున్న చాలా మంది ఆటగాళ్ళు ప్రారంభంలోనే నిష్క్రమించారు. మరికొందరు కొందరు పతకాన్ని గెలుచుకోవడానికి చాలా దగ్గరగా వచ్చిన నిరాసపరిచారు. పిస్టల్ షూటర్ మను భాకర్, సరబ్‌జోత్ సింగ్, రైఫిల్ షూటర్ స్వప్నిల్ కుసాలే మాత్రమే దేశానికి 3 కాంస్య పతకాలు సాధించారు. మరోవైపు మన క్రీడాకారులు పాల్గొనే అనేక క్రీడలు ముగిసిపోయాయి. అయితే కొన్ని క్రీడల్లో ఇంకా భారత్ పాల్గొనాల్సి ఉంది. అలాంటి వాటి కోసం ప్రతి భారతీయుడు ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ప్రతి భారతీయ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ వంతు వచ్చింది. ఆగస్ట్ 6వ తేదీ.. ( ఈ రోజు మంగళవారం) పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోటీ ఉండనుంది. ఎందుకంటే భారతదేశం ఒలింపిక్ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ ఛాలెంజర్ అర్షద్ నదీమ్ పోటీలో ఉన్నారు.
టోక్యో నుండి విజయాల కొనసాగింపు
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఈసారి భారత క్రీడాకారులు తెచ్చే పతకాల సంఖ్య పెరుగుతుందని.. ముఖ్యంగా ఒకటి రెండు బంగారు పతకాలు కచ్చితంగా వస్తాయని భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నప్పటికీ 10 రోజులు గడిచినా 3 కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. ఆ మూడు కాంస్య పతకాలు షూటింగ్ నుంచి వచ్చినవే. పివి సింధు, నిఖత్ జరీన్, లక్ష్య సేన్ వంటి స్టార్లు పతకాలు లేకుండా వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి మన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి సారించారు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది నీరజ్. అథ్లెటిక్స్‌లో స్వతంత్ర భారతదేశానికి ఇది మొదటి పతకం మాత్రమే కాదు.. స్వర్ణం గెలిచిన రెండవ భారతీయుడు.
హలో, పారిస్!
नमस्कार, Paris! 🇮🇳🇫🇷
Excited to finally reach the Olympic Games village. #Paris2024 pic.twitter.com/qinx6MsMDl
— Neeraj Chopra (@Neeraj_chopra1) July 30, 2024
టోక్యో విజయం సాధించిన తర్వాత నీరజ్ అథ్లెటిక్స్ లో తాను పాల్గొన్న ప్రతి ప్రధాన ఈవెంట్‌ను గెలుచుకున్నాడు. అతను ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు, ఒలింపిక్ ఛాంపియన్ అయిన తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్, డైమండ్ లీగ్ వంటి టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు. అంతేకాదు ఇతర ఈవెంట్లలో బంగారు లేదా ఇతర పతకాలను కూడా గెలుచుకున్నాడు. ఈ 3 సంవత్సరాలలో నీరజ్ టాప్-3లో లేని ఈవెంట్ ఏదీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి భారత అభిమానుల ఆశలు అతడిపైనే ఉన్నాయి. అయితే, ఈసారి కూడా జూలియన్ వెబ్బర్, జాకబ్ వాడ్లీచ్ , అండర్సన్ పీటర్స్ వంటి స్టార్ల నుండి నీరజ్ సవాలును ఎదుర్కొవాల్సి ఉంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన క్వాలిఫయర్ ఈ రోజు జరగనుంది.
నీరజ్ వర్సెస్ అర్షద్ పై దృష్టి
ఇదిలావుండగా నీరజ్ బంగారు పతకానికి అతిపెద్ద పోటీదారుగా నిలవనున్నాడు. ఈ దిగ్గజాలు మాత్రమే కాదు నీరజ్‌కు మరో స్టార్ నుండి సవాలు ఎదురవ్వనుంది. అది పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్. నీరజ్ స్వర్ణం, అర్షద్ రజతం సాధించిన ఆసియా క్రీడలు 2018లో వీరిద్దరి మధ్య పోటీ తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది, అక్కడ నీరజ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అర్షద్ ఫైనల్స్‌కు చేరుకోగలిగాడు. అప్పటి నుండి ఇద్దరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్ , డైమండ్ లీగ్ వంటి టోర్నమెంట్‌లలో ఒకరినొకరు ఎదుర్కొన్నారు, కానీ ప్రతిసారీ నీరజ్ గెలిచాడు. విశేషమేమిటంటే క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇద్దరూ ఒకే గ్రూప్‌లో ఉండటం.
Hard to express my feelings of honour and happiness carrying the flag of my Pakistan at the Paris Olympics games 2024 pic.twitter.com/rDWU4ft8nT
— Arshad Nadeem (@ArshadOlympian1) July 27, 2024
మళ్లీ గెలుపై దృష్టి సారించిన నీరజ్
గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇద్దరు ఆటగాళ్లు 9 సార్లు ముఖాముఖి తలపడగా.. రికార్డు 9-0 నీరజ్‌కు అనుకూలంగా ఉంది. అర్షద్ ప్రస్తుతం నీరజ్ కంటే కేవలం ఒక విషయంలో ముందున్నాడు. అది అత్యుత్తమ త్రో. నీరజ్ ఇప్పటి వరకు 90 మీటర్లు దాటలేకపోయాడు. అతని అత్యుత్తమ త్రో 89.94 మీటర్లు. అర్షద్ 90.18 మీటర్ల త్రో విసిరాడు. ఇది అతని అత్యుత్తమం. అయినప్పటికీ నీరజ్ మంచి ఫామ్‌లో ఉండటమే కాకుండా పెద్ద ఈవెంట్‌లలో బాగా ఆడిన అనుభవం కూడా ఉన్నందున విజయానికి పోటీదారుగా ఉంటాడు. గాయం కారణంగా చాలా కాలం పాటు దూరంగా ఉండి తిరిగి వచ్చిన అర్షద్ ముందున్న అతిపెద్ద సవాలు ఫిట్‌నెస్. అటువంటి పరిస్థితిలో అర్షద్ తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి విసరగలడా లేదా అనేది చూడాలి. అయితే నీరజ్‌తో పాటు గతేడాది ఆసియా క్రీడల్లో 87.54 మీటర్లు విసిరి రజత పతకం సాధించిన కిషోర్ జెనాపై కూడా భారతీయులు దృష్టి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..