Watch Video: ఆ సేవలకు రోబోలు.. వింటర్ ఒలింపిక్స్‌లో వినూత్న ప్రయోగానికి సిద్ధం.. ఎందుకంటే?

|

Jan 30, 2022 | 1:17 PM

Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్‌‌లో రోబోట్ సేవలను వినియోగించి, కోవిడ్‌ వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Watch Video: ఆ సేవలకు రోబోలు.. వింటర్ ఒలింపిక్స్‌లో వినూత్న ప్రయోగానికి సిద్ధం.. ఎందుకంటే?
Winter Olympics
Follow us on

Winter Olympics: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(Covid-19) కేసుల సంఖ్య పెరుగుదల కారణంగా, కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీంతో మనుషుల కాంటక్ట్‌లను తగ్గించే ప్రయత్నంలో, రోబోట్‌లు కీలకంగా మారాయి. ప్రస్తుతం బీజింగ్‌లోని హోటళ్లలో రూమ్ సర్వీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈమేరకు రాయిటర్స్ ఓ వీడియోను షేర్ చేసింది. రోబోట్(Robot) అతిథులకు ఆహారాన్ని సులభంగా అందించడాన్ని ఈ వీడియో చూడొచ్చు. అతిధులకు ఆహరాన్ని అందించే రోబోట్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆశారం తీసుకరాగానే రోబోట్ డోర్ తెరుచుకుంటుంది. ఆ తరువాత పిన్‌కోడ్‌ను టైప్ చేస్తే ప్యాక్ ఓపెన్ అవుతుంది. ఆర్డర్ చేసిన వారు ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత, రోబోట్ డోర్ క్లోజ్ అవుతోంది. అనంతరం అక్కడి నుంచి వెననకు వెళ్తుంది.

రాయిటర్స్ షేర్ చేసిన మరో వీడియోలో , సీలింగ్ నుంచి భోజనం వడ్డించడం కనిపిస్తుంది. మీడియా డైనింగ్ ఏరియా రోబోటిక్ రీప్లేస్‌మెంట్‌లతో దృష్టిని ఆకర్షించింది. ABC న్యూస్ ప్రకారం , టోక్యోలోని గేమ్‌లతో పోలిస్తే, వింటర్ ఒలింపిక్స్‌లో ఈ రోబోట్‌లు ఆకట్టుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మీడియా, అథ్లెట్, అధికారుల కోసం కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా అమలు చేయనున్నారు. దీంతో మానవుల సేవలకు బదులుగా ఈ రోబోట్‌లను ఉపయోగించనున్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం , వింటర్ ఒలింపిక్స్‌ విలేజ్‌లోకి ఎంటరైన వారికి రోజువారీ PCR పరీక్షను సిబ్బంది నిర్వహించనున్నారు. అయితే గత 24 గంటల్లో తమకు కోవిడ్ నెగిటివ్ అని నిర్ధారించడానికి గ్రీన్ కోడ్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. లూప్ వెలుపల ఉన్న రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ ఉండదు.

ఫిబ్రవరి 4న ప్రారంభం కానున్న ఈ ఈవెంట్‌కు దేశీయ ప్రేక్షకులు హాజరు కావడానికి అనుమతి లేదు. వింటర్ గేమ్స్ కోసం 2,000 మంది అంతర్జాతీయ క్రీడాకారులు, 25,000 మంది ఇతర అధికారులు చైనాకు చేరుకుంటారని రాయిటర్స్ నివేదిక తెలిపింది.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌ సిరీస్‌ కోసం స్టాండ్‌బైలో ఇద్దరు ఆటగాళ్లు.. ఎవరంటే..?

ODI Records: వీరి కెరీర్‌లో సెంచరీనే లేదు.. లిస్టులో టీమిండియా ప్లేయర్ కూడా..!