Wimbledon 2021: వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం చెలరేగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్‌తోపాటు మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ చేస్తోంది. అసలు వియానికి వస్తే.. పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. లైవ్ బెట్స్ చాలా అధికంగా ఉన్న టైంలో.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ జోడీ పరాజయం పాలైనట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదులు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లలో పరాజయం పాలైంది. అలాగే మరో మ్యాచ్‌లో జర్మన్ ప్లేయర్ ఆడిన తొలి రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ జర్మన్ ప్లేయర్ ప్రత్యర్థిపై అనుమానాలు నెలకొన్నాయి. రెండవ సెట్ తర్వాత భారీ సంఖ్యలో బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై ప్రత్యేకంగా బెట్టింగ్స్ నడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య జరిగిన మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులు ఐటీఐఏకు అందాయి. ఈమేరకు విచారణ చేస్తున్నట్లు ఐటీఐఏ అధికారులు వెల్లడించారు. ఇక వింబుల్డన్ 2021లో మహిళల సింగిల్స్ విజేతగా ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ నిలవగా, పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన ఫైనల్ పోరులో బార్టీ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో గెలిచింది. అలాగే ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మాటియో బెరెటిని పై విజయం సాధించాడు.
Also Read:
Viral Video: ఒలింపిక్ కిట్‌తో టెన్నిస్ స్టార్ డ్యాన్స్.. అదుర్స్ అంటూ నెటిజన్ల కామెంట్లు
Viral Pic: ఇదేంటి.! మెస్సీ, రొనాల్డో చిత్రాలు బీడీ ప్యాకెట్లపైనా.. వైరల్ అవుతున్న పోస్ట్..
Tokyo Olympics 2021: నాడు వారి జీవితాలు దారిద్య్రానికి కేరాఫ్ అడ్రస్… నేడు ఒలింపిక్స్ బరిలో..