Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్య పతకం‎ సాధించిన ఆర్చర్ హర్విందర్ సింగ్

|

Sep 03, 2021 | 6:53 PM

టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. పురుషుల రికర్వ్ ఈవెంట్‌లో కాంస్యం పతకంతో మొత్తం 13 పతకాలను భారత అథ్లెట్లు పొందారు.

Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్య పతకం‎ సాధించిన ఆర్చర్ హర్విందర్ సింగ్
Archer Harvinder Singh
Follow us on

Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్ 2020లో పురుషుల రికర్వ్ ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. ఆర్చర్ హర్విందర్ సింగ్ 6-5తో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సును ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ రోజు భారతదేశానికి ఇది మూడవ పతకం. దీంతో పారాలింపిక్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు ఇప్పటి వరకు 13 పతకాలను సాధించారు.క్వార్టర్‌ఫైనల్లో జర్మనీ క్రీడాకారిణి మైక్ జార్జ్‌వ్స్కీని 6-2 తేడాతో ఓడించిన దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌ సు‌తో పోటీపడ్డాడు.

ఇంతకుముందు పారాలింపిక్స్ చరిత్రలోనే 1968 నుంచి 2016 వరకూ ఓవరాల్‌గా భారత్ 12 పతకాలు గెలిచింది. ప్రస్తుతం టోక్యో వేదికగా జిరిగే పారాలింపిక్స్‌లో మాత్రం ఇప్పటివరకు 13 పతకాలను భారత అథ్లెట్లు సాధించారు.

ఈరోజు ఉదయం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో అవనీ లేఖరా స్వర్ణం గెలిచి, చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

హై జంప్ టీ64 విభాగంలో 2.07 మీటర్లతో ఆసియా రికార్డు క్రియేట్ చేసిన ప్రవీణ్ కుమార్ కూడా నేడు రజత పతకాన్ని సాధించాడు. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన భారత్.. పతకాల పట్టికలో 37వ స్థానంలో కొనసాగుతోంది.

Also Read: IND vs ENG: యూపీ అబ్బాయి బెంగాల్‌లో ఇరగదీశాడు.. సౌరవ్ గంగూలీ అండతో టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు.. అతనెవరంటే?

Virat Kohli: దిగ్గజాలను వెనక్కునెట్టిన టీమిండియా కెప్టెన్.. ఓవల్ టెస్టులో విరాట్ కోహ్లీ మరో రికార్డు

Virat Kohli: చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్‌..! వరుసగా 6 సార్లు ఒకే విధంగా ఔట్‌.. నిరాశలో ఫ్యాన్స్

IND vs ENG 4th Test Day 2 Live: ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ టీం.. ఫలించిన భారత బౌలర్ల ఎదురుచూపులు