Telangana: కత్తి దూస్తే పతకమే.. కత్తి కాంతారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్న కోదాడ బాలిక..

| Edited By: Shaik Madar Saheb

Nov 25, 2024 | 8:26 PM

కత్తి సాము అనేది ప్రాచీనమైన విద్య. కత్తి సాము విన్యాసాలు జానపద, పౌరాణిక చిత్రాల్లో మాత్రమే మనం చూస్తుంటాం. కత్తి సాము అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది కత్తి కాంతారావు. జానపద చిత్రాల్లోని ఆయన ‘‘కత్తియుద్ధం’’.. నాడు తెలుగునాట సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించింది. అలాంటి కత్తి కాంతారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ..

Telangana: కత్తి దూస్తే పతకమే.. కత్తి కాంతారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్న కోదాడ బాలిక..
Kodad Girl excels in Fencing
Follow us on

కత్తి సాము అనేది ప్రాచీనమైన విద్య. కత్తి సాము విన్యాసాలు జానపద, పౌరాణిక చిత్రాల్లో మాత్రమే మనం చూస్తుంటాం. కత్తి సాము అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది కత్తి కాంతారావు. జానపద చిత్రాల్లోని ఆయన ‘‘కత్తియుద్ధం’’.. నాడు తెలుగునాట సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించింది. అలాంటి కత్తి కాంతారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ అబ్బుర పరుస్తోంది ఓ బాలిక. సుమారు 450 సాంఘిక, జానపద చిత్రాల్లో నటించిన మొదటి తరం కథానాయకుడు లక్ష్మి కాంతారావు.. కత్తి సాముతో కత్తి కాంతారావుగా ప్రేక్షక లోకం గుర్తించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో 1923 నవంబర్‌ 16 తేదీన కాంతారావు జన్మించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి కత్తి పట్టి జాతీయస్థాయిలో ఫెన్సింగ్‌(కత్తిసాము) క్రీడలో రాణిస్తోంది. గుడిబండకు చెందిన వెంకటేశ్వర్లు.. హైదరాబాదులో హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు కూడా కత్తి సాము అంటే ఎంతో ఇష్టం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆటగా గుర్తింపు పొందిన ఫెన్సింగ్‌(కత్తిసాము) క్రీడలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక.. కత్తి సాము విద్య పూర్తిగా అభ్యసించలేకపోయాడు.

అయితే, వెంకటేశ్వర్లకు చరితశ్రీ అనే కూతురు 9వ తరగతి చదువుతోంది. చరితశ్రీ చిన్నతనం నుంచే తండ్రి నుంచి కత్తిసాములో ప్రేరణ పొందింది. దాంతో పాటు అలనాటి సినీ నటుడు కత్తి కాంతారావు గుడిబండకు చెందిన వ్యక్తి కావడంతో చరితశ్రీకి ఈ క్రీడపై మరింత మక్కువ ఏర్పడింది. హైదరాబాదులో చదువుతున్న చరితశ్రీ.. సూరజ్‌ నవీన్‌ అనే కోచ్ వద్ద రెండేళ్లుగా ఫెన్సింగ్‌(కత్తిసాము) ఆటలో శిక్షణ పొందుతోంది. శారీరకంగా ఎత్తుగా ఉండడంతో ఈపీ విభాగాన్ని ఎంచుకుని చరితశ్రీ రాణిస్తోంది. పాఠశాల స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొంది. తన ఫెన్సింగ్ (కత్తి సాము) విన్యాసాలతో చరితశ్రీ అందరిని అబ్బుర పరుస్తోంది.

వీడియో చూడండి..

జాతీయ స్థాయిలో రాణింపు..

ఏపీలోనే రాజమండ్రిలో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ పోటీలకు తెలంగాణ తరపున పాల్గొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన 68వ అండర్‌-14 జాతీయ స్థాయి పాఠశాల పోటీలకు రాష్ట్రం తరఫున అవకాశం దక్కించుకుంది. డిసెంబరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మరోసారి సత్తా చాటేందుకు చరిత శ్రీ తీవ్రంగా శ్రమిస్తోంది. తన తండ్రి కలను సాకారం చేయడానికి కత్తి పట్టిన చిన్నారి నేడు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ రాష్ట్రం తరఫున పాల్గొని అవార్డులు సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో పతకాల పంట పండించి.. అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మా గ్రామానికి చెందిన జానపద సినీ హీరో కత్తి కాంతారావు స్ఫూర్తితోనే ఈ క్రీడలో రాణిస్తున్నానని చరిత శ్రీ చెబుతోంది. ఎప్పటికైనా దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని చిన్నారి చరిత శ్రీ చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..