Sania Mirza: సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి… ఇంగ్లాండ్ సర్కారుకు క్రీడా శాఖ విజ్ఞప్తి

|

May 20, 2021 | 9:44 AM

Sania Mirza Son: యూకే టూర్‌లో సానియా మీర్జా వెంట ఆమె రెండేళ్ల కుమారుణ్ణి అనుమతించండి అని యూకే ప్రభుత్వాన్ని కేంద్ర క్రీడల శాఖ కోరింది. వింబుల్డన్ సహా పలు టోర్నీల్లో పాల్గొనేందుకు యూకే వెళ్తున్న సానియా మీర్జా...

Sania Mirza: సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి... ఇంగ్లాండ్ సర్కారుకు క్రీడా శాఖ విజ్ఞప్తి
Sania Mirza Son
Follow us on

యూకే టూర్‌లో సానియా మీర్జా వెంట ఆమె రెండేళ్ల కుమారుణ్ణి అనుమతించండి అని యూకే ప్రభుత్వాన్ని కేంద్ర క్రీడల శాఖ కోరింది. వింబుల్డన్ సహా పలు టోర్నీల్లో పాల్గొనేందుకు యూకే వెళ్తున్న సానియా మీర్జా… అక్కడి నుంచి నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తారు.  ముందు సిద్ధమయ్యే క్రమంలో ఈ టోర్నీల్లో పాల్గొంటారు. తాన కుమారుడి వీసా విషయంలో ఆంక్షలు అడ్డు రావడంతో క్రీడాశాఖ సహాయంను కోరారు సానియా మీర్జా.

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సహా రాబోయే కొన్ని వారాల్లో ఇంగ్లండ్‌లో పలు టోర్నీల్లో పాల్గొననున్న భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు కోవిడ్ ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. తనతోపాటు తన కుమారుడు ఇజ్‌హాన్‌కు, సహాయకురాలికి కూడా వీసా ఇవ్వాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని ఇంగ్లండ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. క్రీడాకారిణిగా సానియాకు వీసా మంజూరు చేయగా… ప్రస్తుతం కోవిడ్  కారణంగా భారత్‌ నుంచి వచ్చే ఇతర ప్రయాణీకుల విషయంలో ఇంగ్లాండ్  ఆంక్షలను ఏర్పాటు చేసింది. ఈ ఆంక్షల నేపథ్యంలో కేవలం క్రీడాకారులను మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.

దీంతో తన సమస్యను సానియా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్ల కుమారుడిని వదిలి తాను ఉండటం కష్టమని ఆమె పేర్కొంది. సానియా లేఖపై స్పందించిన కేంద్రం… విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. లండన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయంలో సహకరిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.

 ఇవి కూడా చదవండి: మా పంట కొనేది ఎవరు రామచంద్రా..! “జల దీక్ష” చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా జొన్న రైతులు