SFA Championships 2024 Day 13: అగ్రస్థానంలో విజ్ఞాన్ బో ట్రీ స్కూల్.. ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్

|

Oct 28, 2024 | 6:54 PM

SFA Championships 2024 Day 13: ముగింపు వేడుక మాత్రమే మిగిలిన ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 2024లో విజ్ఞాన్ బో ట్రీ స్కూల్ లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన ఆటతీరుతో సత్తా చాటి చివరి వరకు మొదటిస్థానంలోనే నిలిచింది.

SFA Championships 2024 Day 13: అగ్రస్థానంలో విజ్ఞాన్ బో ట్రీ స్కూల్.. ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్
Sfa Championships 2024 13th Day
Follow us on

SFA Championships 2024 Day 13: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA)తో సహకారంతో టీవీ9 నెట్‌వర్క్‌ విప్లవాత్మక ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పలు స్టేడియంలలో వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. SFA ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీలు యువ క్రీడాకారుల ప్రతిభను చాటిచెప్పేందుకు, వారి నైపుణ్యాలను ప్రదర్శించే వేదికలా మారింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 12 రోజులు విజయవంతంగా జరిగిన SFA ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీలు.. నేడు కూడా ఆకట్టుకున్నాయి. చివరి రోజైన 13వ రోజు హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీలో ఉత్కంఠరేపే ఫైనల్స్, హై-స్టేక్స్ మ్యాచ్‌లతో సందడిగా మారాయి. విద్యార్ధులు ఉత్సాహంగా పలు క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. SFA ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీల్లో గెలిచిన విజేతలను 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరిస్తారని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అగ్రస్థానంలో విజ్ఞాన్ బో ట్రీ స్కూల్..

హైదరాబాద్‌లో SFA ఛాంపియన్‌షిప్‌ 2024 ముగింపు దశకు చేరుకుంది. కాగా, గచ్చిబౌలిలో జరిగిన హ్యాండ్‌బాల్‌లో బ్లూ బ్లాక్స్ కంప్లీట్ స్కూల్ బాలికల అండర్-12 విభాగంలో విజ్ఞాన్ బో ట్రీ స్కూల్‌ను ఓడించి స్వర్ణం సాధించగా, అండర్-12 బాలుర విభాగంలో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. U-14 బాలికలు, బాలుర విభాగాల్లో విగ్నన్ బో ట్రీ స్కూల్ విజయాలు సాధించింది. U-16 బాలుర ఫైనల్‌లో నీలకంత్ విద్యాపీఠ్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది.

ఇక బాస్కెట్‌బాల్ విషయానికి వస్తే, సాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్‌తో జరిగిన U-11 బాలుర ఫైనల్‌లో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ స్వర్ణం సాధించింది. U-18 బాలుర ఫైనల్‌లో రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది.

శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన కబడ్డీ ఫైనల్స్‌లో గర్ల్స్ అండర్-17 ఫైనల్‌లో గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయం, LMG స్మార్ట్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించి, విజేతగా నిలిచింది.

ఇప్పటి వరకు జరిగిన అన్ని పోటీల్లో విగ్నాన్స్ బో ట్రీ స్కూల్ లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంతో దూసుకపోతోంది. ఈ సంవత్సరం హైదరాబాద్ ఎడిషన్ SFA ఛాంపియన్‌షిప్స్‌లో 920 పాఠశాలల నుంచి 23,000 మంది అథ్లెట్లు 22 క్రీడలలో పోటీ పడుతున్నారు. ఈ ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ నేటితో ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..