Asia Championships: 58 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత జోడీ..

|

May 01, 2023 | 12:26 AM

Satwiksairaj Rankireddy-Chirag Shetty: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడి నెలకొంది. హై-వోల్టేజ్ పోటీలతో ఫ్యాన్స్‌కు మస్త్ ఎంటర్టైన్‌మెంట్ అందుతోంది. అయితే, ఇలాంటి తరుణంలో యావత్ భారతదేశం గర్వించే న్యూస్ బ్యాడ్మింటన్‌ నుంచి అందింది.

Asia Championships: 58 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత జోడీ..
Asia Championships
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడి నెలకొంది. హై-వోల్టేజ్ పోటీలతో ఫ్యాన్స్‌కు మస్త్ ఎంటర్టైన్‌మెంట్ అందుతోంది. అయితే, ఇలాంటి తరుణంలో యావత్ భారతదేశం గర్వించే న్యూస్ ఒకటి అందింది. బ్యాడ్మింటన్‌ కోర్టులో సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వీరద్దరూ కలిసి చరిత్ర సృష్టించారు.

58 ఏళ్ల కరువు తీరింది..

చెన్నైలో ధోనీ సేన 4 వికెట్ల తేడాతో ఓడిపోయినా ఐపీఎల్ సందడితో చెన్నై ప్రతిధ్వనించింది. మరోవైపు దుబాయ్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మ్యాచ్‌లో వెనుకబడిన తర్వాత, సాత్విక్, చిరాగ్ అద్భుతమైన పునరాగమనం చేసి 58 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని ఆసియా ఛాంపియన్‌గా మార్చారు. 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఈ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా వీరు రికార్డులకెక్కింది.

గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఈ భారత జోడీ ముందు మలేషియాకు చెందిన ఓంగ్ యు సిన్, టీయో ఈ యీ జోడీ ఫైనల్లో తలపడ్డారు. సాత్విక్, చిరాగ్ మొదటి గేమ్‌ను 16-21తో కోల్పోయారు. ఇక రెండవ గేమ్‌ను 21-17తో గెలుచుకున్నారు. ఆ తర్వాత హై వోల్టేజ్ మూడవ గేమ్‌ను 21-19తో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేష్ ఖన్నా ఏకైక స్వర్ణం సాధించాడు. 1971లో పురుషుల డబుల్స్‌లో భారతదేశం అంతకుముందు అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీప్ ఘోష్, రామన్ ఘోష్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..