Sania Mirza: ప్రధాని మోదీ ‘ప్రకటన’పై స్పందించిన సానియా.. దేశం కోసం చేతనైనంతా చేస్తా

దేశం తరఫున సానియా మిర్జా సాధించిన విజయాలకు ప్రతిగా ఆమెను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. మార్చి 9న ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై తాజాగా సానియా మీర్జా..

Sania Mirza: ప్రధాని మోదీ ‘ప్రకటన’పై స్పందించిన సానియా.. దేశం కోసం చేతనైనంతా చేస్తా
Sania Mirza

Updated on: Mar 11, 2023 | 4:23 PM

ఆరు రోజుల  క్రితం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ సానియా మీర్జా ఆటకు శాశ్వతంగా రిటైర్‌మెంట్ తెలిపారు. అయితే ఆదివారం జరిగిన ఆ మ్యాచ్ చూసేందుకు పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు. ఆ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశం తరఫున సానియా మిర్జా సాధించిన విజయాలకు ప్రతిగా అభినందిస్తూ మార్చి 9న ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై తాజాగా సానియా మీర్జా స్పందించారు. ప్రధాని చేసిన ప్రకటనను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆమె ఏమని రాసుకొచ్చారంటే..

‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి నా కృతజ్ఞతలు. నా సామర్థ్యం మేరకు మన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు నేను ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తున్నాను. ఇంకా మన  దేశం గర్వపడేలా నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాను. మీ మద్దతుకు ధన్యవాదాలు’’.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..