PKL 2023 Schedule, Live Streaming: 4ఏళ్ల తర్వాత 12 నగరాల్లో కబడ్డీ కూత.. పూర్తి షెడ్యూల్ ఇదే..

|

Nov 27, 2023 | 6:54 PM

Pro Kabaddi League 2023 Timetable, Full Schedule, Live Streaming Channel in Telugu: ప్రో కబడ్డీ 2023 మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. దీని తరువాత, యూ ముంబా వర్సెస్ యూపీ యోధాస్ జట్లు డిసెంబర్ 2 న తలపడనున్నాయి. ఫజల్ అత్రాచలి, మహ్మద్ ఇస్మాయిల్ నబీబక్ష్, పవన్ కుమార్ సెహ్రావత్, పర్వేష్ భైన్‌వాల్, పర్దీప్ నర్వాల్, గిరీష్ మారుతీ ఎర్నాక్, నితేష్ కుమార్ వంటి ఆటగాళ్లను మొదటి రోజునే అభిమానులు చూడగలరు.

PKL 2023 Schedule, Live Streaming: 4ఏళ్ల తర్వాత 12 నగరాల్లో కబడ్డీ కూత.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Pkl 2023
Follow us on

Pro Kabaddi 2023: ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ చారిత్రాత్మక 10వ సీజన్ (Pro Kabaddi 2023) షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఎట్టకేలకు, 4 సంవత్సరాల తర్వాత, కబడ్డీ కూత 12 వేర్వేరు నగరాల్లో మరోసారి వినిపించబోతోంది. PKL 10 డిసెంబర్ 2, 2023న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు డిసెంబర్ 6 వరకు ట్రాన్స్‌ స్టేడియంలో జరుగుతాయి.

లీగ్ దశ మ్యాచ్‌లు 2 డిసెంబర్ 2023 నుంచి 21 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించనున్నారు.

లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు: అహ్మదాబాద్ (డిసెంబర్ 2-7), బెంగళూరు (డిసెంబర్ 8-13), పుణె (డిసెంబర్ 15-21), చెన్నై (22-27 డిసెంబర్), నోయిడా (29 డిసెంబర్ – 3 జనవరి), ముంబై (5-10 జనవరి), జైపూర్ (జనవరి 12-17), హైదరాబాద్ (జనవరి 19-24), పాట్నా (జనవరి 26- జనవరి 31), ఢిల్లీ (ఫిబ్రవరి 2-7), కోల్‌కతా (ఫిబ్రవరి 9-14), పంచకుల (ఫిబ్రవరి 16-21 ) లో జరగనున్నాయి.

ప్రో కబడ్డీ 2023 మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. దీని తరువాత, యూ ముంబా వర్సెస్ యూపీ యోధాస్ జట్లు డిసెంబర్ 2 న తలపడనున్నాయి. ఫజల్ అత్రాచలి, మహ్మద్ ఇస్మాయిల్ నబీబక్ష్, పవన్ కుమార్ సెహ్రావత్, పర్వేష్ భైన్‌వాల్, పర్దీప్ నర్వాల్, గిరీష్ మారుతీ ఎర్నాక్, నితేష్ కుమార్ వంటి ఆటగాళ్లను మొదటి రోజునే అభిమానులు చూడగలరు. డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ డిసెంబర్ 4న పుణెరి పల్టాన్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది.

ప్రొ కబడ్డీ 2023 షెడ్యూల్‌ను ప్రకటిన సందర్భంగా లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. “మషల్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ 2023 షెడ్యూల్‌ను ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. గత సీజన్‌లో లాగానే, ఈసారి కూడా PKL అభిమానుల మనోభావాలను, 10వ సీజన్‌లో అధిక-నాణ్యత, తీవ్రమైన పోటీని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ రూపొందించాం” అని తెలిపారు.

ప్రో కబడ్డీ 2023 వేలంలో మిలియనీర్లుగా మారిన ఐదుగురు ఆటగాళ్లు..

ఇటీవల, PKL 10వ సీజన్ కోసం వేలం అక్టోబర్ 9, 10 తేదీలలో ముంబైలో నిర్వహించారు. ఇందులో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు కోటీశ్వరులు కావడం, అలాగే పీకేఎల్ చరిత్రలో తొలిసారిగా ముగ్గురు ఆటగాళ్లను రెండు కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు.

లీగ్‌లో పవన్ కుమార్ సెహ్రావత్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఈసారి అతన్ని రూ. 2.605 కోట్లకు తెలుగు టైటాన్స్ కొనుగోలు చేసింది. వీరితో పాటు మహ్మద్రెజా షాడ్లూను పుణెరి పల్టాన్ రూ.2.35 కోట్లకు, మణిందర్ సింగ్‌ను బెంగాల్ వారియర్స్ రూ.2.12 కోట్లకు కొనుగోలు చేసింది. వీరితో పాటు ఫాజెల్ అత్రాచలి (1.60 కోట్లు)ని గుజరాత్ జెయింట్స్, సిద్ధార్థ్ దేశాయ్ (1 కోటి)ని హర్యానా స్టీలర్స్ అత్యధిక ధరకు కొనుగోలు చేశాయి.

ఎక్కడ చూడాలి?

PKL 10వ సీజన్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌తోపాటు, హాట్‌స్టార్‌లోనూ చూడొచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..