Chess Olympiad: చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. టోర్నీకి తరలివచ్చిన 190 దేశాల చెస్ క్రీడాకారులు
తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడోత్సవానికి 180 దేశాల నుంచి 1700 మంది చెస్ క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్ ప్రారంభించారు.
భారత్ వేదికగా అతిపెద్ద 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభమైంది. తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడోత్సవానికి 190 దేశాల నుంచి 1700 మంది చెస్ క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెస్ ఒలింపియాడ్ ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టేడియంలో ఎక్కడ చూసినా బ్లాక్ అండ్ వైట్ చెస్ గడులు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. భారీ చెస్ పావులను గడుల్లో నిలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడికి వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సత్కరించారు.
Tamil Nadu CM MK Stalin felicitates Prime Minister Narendra Modi at the opening ceremony of the 44th Chess Olympiad in Chennai pic.twitter.com/bjCkBO7XuI
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 28, 2022
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో.. రష్యాలో జరగాల్సిన చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం భారత్‌కు మారింది. అతి తక్కువ సమయంలో భారీ ఏర్పాట్లు చేసింది. 190 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు ఈ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం..