- Telugu News Photo Gallery Sports photos CWG 2022 Opening Ceremony: PV Sindhu, Manpreet Singh Lead India at Commonwealth Games Athletes' Parade
CWG 2022: వైభవంగా ప్రారంభమైన కామెన్వెల్త్ గేమ్స్.. భారత జట్టుకి ఫ్లాగ్ బేరర్స్‌గా సారథ్యం వహించిన పీవీ సింధు, మన్‌ప్రీత్ సింగ్
CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. క్రీడలు ప్రారంభానికి గుర్తుగా బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది.
Updated on: Jul 29, 2022 | 8:22 AM

కామన్వెల్త్ క్రీడలు బర్మింగ్‌హామ్‌లో కలర్‌ఫుల్ ప్రోగ్రామ్‌తో ప్రారంభమయ్యాయి. 30 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో అనేకమంది అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. బాణాసంచా, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షలకు కనువిందు చేశాయి

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఈసారి ప్రారంభోత్సవ వేడుకల్లో కనిపించలేదు. రాణి స్థానంలో ప్రిన్స్ చార్లెస్ క్రౌన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన భార్య కమిలాతో కలిసి స్వయంగా స్టేడియానికి చేరుకున్నారు.

వేడుకలో బర్మింగ్‌హామ్‌లోని మోటార్ పరిశ్రమ స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐదు దశాబ్దాల నాటి 72 వాహనాలు వేదికపైకి వచ్చి బ్రిటిష్ జెండా రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ వాహనాలు మినీ కూపర్ నుండి అనేక పాతకాలపు వాహనాల వరకు ఉన్నాయి.

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా క్రీడాకారులందరికీ క్రీడలకు స్వాగతం పలికారు. విద్య, శాంతి సందేశం ఇచ్చారు. మలాలా తన శస్త్రచికిత్స తర్వాత బర్మింగ్‌హామ్‌లో స్థిరపడింది. బ్రిటన్ ను తన సొంత ఇంటిగా భావిస్తోంది.

ప్రారంభ వేడుకలో 10 మీటర్ల పొడవైన ఎద్దును ఏర్పాటు చేశారు. దీని సహాయంతో బర్మింగ్‌హామ్ తన సంవత్సరాల పోరాటాన్ని ప్రదర్సించారు. ఈ నగరం అన్ని కష్టాలను ఎలా అధిగమించిందో చూపించారు.

ప్రారంభ వేడుకల్లో భారత జట్టు అడుగుపెట్టడంతో స్టేడియం మొత్తం మారుమోగింది. ప్రారంభోత్స వేడుకలకు భారత బృందానికి ఫ్లాగ్ బేరర్స్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించారు




