PM Modi: ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్.. ఫొటోలు

చెస్ ఒలింపియాడ్ కోసం చెన్నై చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గంలో నెహ్రూ స్టేడియానికి ప్రయాణిస్తుండగా.. వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా నిల్చొని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.

Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2022 | 6:01 AM

Chess Olympiad 2022: భారత్‌ వేదికగా 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ఘనంగా ప్రారంభమైంది. తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ప్రపంచ చెస్ క్రీడోత్సవంలో 190 దేశాల నుంచి 1700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ చెస్ ఒలింపియాడ్ కోసం చెన్నై చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది.

1 / 5
ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గంలో నెహ్రూ స్టేడియానికి ప్రయాణిస్తుండగా.. వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా దారి పొడవునా సంస్కృతి కార్యక్రమాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చదరంగం బోర్డు డిజైన్‌తో కూడిన షాల్‌ను ధరించారు.

2 / 5
బీజేపీ తమిళనాడు యూనిట్ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగం ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సంగీతం, సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ కారుపై పూల వర్షం కురిపించారు. మెరీనా బీచ్ సమీపంలోని నావల్ హెలిప్యాడ్‌కు చేరుకోవడానికి ప్రధాని విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వెళ్లారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో 'వణక్కం మోడీ' ట్రెండింగ్ అయింది.

3 / 5
FIDE 44వ చదరంగం ఒలింపెయిడ్ జూలై 28న ప్రారంభమై ఆగస్ట్ 10న ముగుస్తుంది. దీంతో అందరినీ ఆకట్టుకునేలా రంగురంగుల కాంతులతో చెన్నై నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా చదరంగం బోర్డుల మాదిరిగా ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేశారు.

4 / 5
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్​స్టార్ రజనీకాంత్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రారంభ వేడుకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులను ఆకట్టుకున్నాయి.

5 / 5
Follow us