Tokyo Olympics: “నాన్న కల నిజమైంది. కానీ, నేడు ఆయన నా పక్కన లేడు”: హాకీ క్రీడాకారిణి లాల్‌రెమియామి

| Edited By: Anil kumar poka

Jul 05, 2021 | 6:52 PM

"టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే హాకీ జట్టుకు ఎంపిక కావడం తన కెరీర్‌లో అతిపెద్ద విజయమని" ఇండియా హాకీ క్రీడాకారిణి లాల్‌రెమియామి ఆదివారం వెల్లడించింది.

Tokyo Olympics: నాన్న కల నిజమైంది. కానీ, నేడు ఆయన నా పక్కన లేడు: హాకీ క్రీడాకారిణి లాల్‌రెమియామి
Hockey Player Lalremsiami
Follow us on

Tokyo Olympics: “టోక్యో ఒలింపిక్స్‌కు చెందిన ఇండియన్ కంటిజెంట్‌లో ఎంపిక కావడం తన కెరీర్‌లో అతిపెద్ద విజయమని” ఇండియా హాకీ క్రీడాకారిణి లాల్‌రెమియామి ఆదివారం వెల్లడించింది. నేను ఒలింపిక్స్‌లో ఆడడం తన తండ్రి కలని ఆమె పేర్కొంది. కానీ, ఒలింపిక్స్ లో నా ఆటను చూసేందుకు నేడు మానాన్న భూమిపై లేడని వాపోయింది. మిజోరం నుంచి ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అలాగే 25 సంవత్సరాల తరువాత తన రాష్ట్రానికి ఒలింపిక్ పతకాన్ని అందించే అవకాశం దక్కింది. చివరి సారిగా ఆర్చర్ సి లాల్రేమ్‌సంగా మిజోరాం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 1992 బార్సిలోనా, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌ కు ప్రాతినిధ్యం వహించాడు.

మిజోరాంలోని కోలాసిబ్‌కు చెందిన లాల్‌రెమ్సియామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇది నా కెరీర్‌లో తక్కువ సమయంలో సాధించిన అతిపెద్ద ఘనత” అని పేర్కొంది. టోక్యో-బౌండ్ స్క్వాడ్ లో ఆతిథ్య జపాన్‌ను 3-1 తేడాతో భారత్‌ ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకుంది. ఈ సమయంలోనే తన తండ్రి మరణించాడు. కానీ, ఆయన చివరిచూపు నోచుకోలేక పోయింది. “మా నాన్నా నాకు ఎంతో అండగా నిలిచాడు. నేను కెరీర్‌లో తీసుకునే ప్రతీ నిర్ణయానికి ఆయన మద్దతు ఉండేది. ప్రస్తుతం ఆయన నా పక్కన లేడనే బాధగా ఉంటోంది. ఆయన చివరి చూపుకు నోచుకోలేకపోయాను. ఏదో ఒక రోజు ఒలింపిక్స్‌లో ఆడాలన్నదే ఆయన కోరిక. అది నేటికి నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫాదర్స్‌ డే నాడు నా మా నాన్న పక్కన లేడనే బాధ ఉంది. కానీ, ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటాడనే నమ్ముతున్నానని” ఆమె ఉద్విగ్నంగా మాట్లాండింది.

మిజోరంలో ఎక్కువ మంది హాకీ ఆడరు. ఫుట్‌బాల్, ఆర్చర్, మార్షల్ ఆర్ట్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దీంతో లాల్‌రెమ్సియామి హాకీని తనకు ఇష్టమైన క్రీడగా ఎంచుకుంది. “నేను 11 సంవత్సరాల వయసు నుంచి హాకీ ఆడటం మొదలుపెట్టాను. నన్ను పాఠశాల స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేసినప్పుడు నాకు సరిగ్గా హాకీ ఆడడం రాద” ని ఆమె పేర్కొంది. ఆ తరువాత 2011 లో తెన్జాల్‌లోని శాయ్ సెంటర్‌లో హాకీ అకాడమీలో చేరింది. అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. లాల్‌రెమ్సియామి కుటుంబానికి మొదట్లో హాకీ గురించి ఏమీ తెలియదు. దీంతో కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

2019 లో మహిళల ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్ అవార్డును గెలుచుకోవడంతో వెలుగులోకి వచ్చింది లాల్‌రెమియామి. ప్రస్తుతం టోక్యో గేమ్స్‌లో భారత మహిళల టీం.. తమ తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించేందుకు ఎదురుచూస్తోంది. పతకం కోసం చివరి వరకు పోరాడతామని దీమా వ్యక్తం చేసింది. ” ఈ కష్టమైన కోవిడ్ సమయంలో మేం చాలా కష్టపడ్డాం. చాలా విషయాలకు రాజీ పడాల్సి వచ్చింది. మా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. జట్టులో నా పాత్ర నాకు బాగా తెలుసు. జట్టు కల నెరవేర్చడానికి కృషి చేస్తాను” అని ముగించింది. భారత మహిళల హాకీ టీం మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది అలాగే వరుసగా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. 1980 లో మొదటిసారిగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. అలాగే 2016 లోనూ భాగస్వామ్యమైంది.

Also Read:

Indian Sailor KC Ganapathy: భారత సెయిలర్‌ కేసీ గణపతి గురించి మీకు తెలియని విషయాలు..!

Tokyo Olympics: జపాన్ నిబంధనలు చాలా దారుణం: భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌ ప్రతినిధులు