Rohan Bopanna Announced Retirement: పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ టెన్నిస్ తొలి రౌండ్‌లో ఓడిన భారత దిగ్గజం రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5-7, 6-2తో ఫ్రెంచ్ జోడీ గేల్ మోన్‌ఫిల్స్, ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ చేతిలో ఓడారు. దీంతో భారత జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఇది ఖచ్చితంగా దేశం తరపున నా చివరి ఈవెంట్ అవుతుంది. నేను ఎక్కడ ఉన్నానో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు టెన్నిస్ సర్క్యూట్‌ను ఆస్వాదిస్తూనే ఉంటాను. ఇది గొప్ప అవకాశం. 22 ఏళ్ల తర్వాత కూడా నేను భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
బోపన్న, బాలాజీ ఓటమితో 1996 తర్వాత టెన్నిస్‌లో భారత్‌కు ఒలింపిక్ పతక కరువు కొనసాగింది. బోపన్న 2016లో ఈ కరువును ముగించే దశకు చేరుకున్నాడు. అయితే, సానియా మీర్జా జోడీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది. 2026 ఆసియా క్రీడలకు కూడా బోపన్న దూరం కానున్నాడు. అతను ఇప్పటికే డేవిస్ కప్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..