PM Modi: ప్రధాని మోడీని కలిసిన పారాలింపిక్ క్రీడాకారులు.. భావోద్వేగంతో కన్నీరు.. మీలాంటి పీఎంను ఇంతవరకు చూడలేదంటూ కితాబిచ్చిన ఆటగాళ్లు

పారాలింపిక్ ఆటగాళ్లు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంపొందిస్తూ, మీరు చాలా కష్టపడ్డారని ప్రధాని అన్నారు.

PM Modi: ప్రధాని మోడీని కలిసిన పారాలింపిక్ క్రీడాకారులు.. భావోద్వేగంతో కన్నీరు.. మీలాంటి పీఎంను ఇంతవరకు చూడలేదంటూ కితాబిచ్చిన ఆటగాళ్లు
Pm Narendra Modi
Follow us

|

Updated on: Sep 12, 2021 | 1:33 PM

Paralympics: ఇటీవల ముగిసిన టోక్యో 2020 పారాలింపిక్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత క్రీడాకారులను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. భారతదేశం గర్వపడేలా చేసిన వీరు.. పారాలింపిక్ క్రీడల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో 19 పతకాలు సాధించి భారత పతాకాన్ని టోక్యో రెపరెపలాడించారు. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న ఈ ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు కలిశారు. ఆటగాళ్లతో ప్రధాని మోదీ క్రీడలలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా మాట్లాడారు. ఈ సమయంలో ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు పీఎం వారి మనోబలాన్ని పెంపొందించారు. మీరు చాలా కష్టపడ్డారు అని ధైర్యం చెప్పారు. మీరు మా ఆటను ఐదు రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయలేదంటూ క్రీడాకారులు ప్రధానికి కితాబిచ్చారు.

ఒక ఆటగాడు పీఎం మోడీతో ఓడిపోయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. కానీ ఈ ఓటమి అతడిని మరింత బలోపేతం చేసింది. మరోసారి గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. ఆటలో ఓడిపోయిన ఆటగాళ్ల ధైర్యాన్ని పెంపొందిస్తూ, ఓడిపోవడం ద్వారా గెలవడమే మా అతిపెద్ద బలం అని ప్రధాని అన్నారు. ఓటమి ద్వారా మనోధైర్యాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. 130 కోట్ల మంది భారతీయులు మీతో ఉన్నారని ఆయన అన్నారు.

మరో పారాలింపిక్ ఆటగాడు ఇది నా మొదటి పారాలింపిక్ అని పీఎం మోడీకి చెప్పాడు. మరోసారి నేను ఖచ్చితంగా పతకంతో వస్తానని తెలిపాడు. ఇతర దేశాల ఆటగాళ్లు తమ ప్రధాని లేదా అధ్యక్షుడు తమతో నేరుగా మాట్లాడరని చెప్పారని, కానీ ఈ విషయంలో మేం సంతోషంలో ఉన్నామని అన్నాడు. అదే సమయంలో, మరొక ఆటగాడు మీ కథ కూడా పారాలింపిక్ క్రీడాకారుల మాదిరిగానే ఉంటుంది. ఇది మాకు చాలా ప్రేరణాత్మకంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

వికలాంగ క్రీడాకారుల కోసం వర్క్‌షాప్ వికలాంగ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ, వికలాంగ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమని, ఎందుకంటే వారి శారీరక సామర్థ్యం మాత్రమే కాకుండా మానసికంగా సాధారణ ఆటగాడికి చాలా భిన్నంగా ఉంటారని, వారిని అర్థం చేసుకోవాలని పీఎం అన్నారు. అలాంటి క్రీడాకారుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ఆయన కోరారు.

పారాలింపిక్ ఆటగాడు శరద్ పీఎం మోడీతో మాట్లాడుతూ, నేను ఇప్పుడు తదుపరి ఆటను పూర్తి అభిరుచితో ఆడతాను. మీరు చెప్పినట్లు, టెన్షన్ , ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా గెలుపుపై ​​దృష్టి సారించి నా తదుపరి ఆటను ఆడతానని తెలిపాడు.

Also Read: IPL 2021: జమైకా నుంచి లండన్ వరకు.. ఐపీఎల్ 2021 కి ముందు ధోని కుర్రాళ్ల ఆధిపత్యం.. ఇక దబిడదిబిడే అంటోన్న సీఎస్‌కే ప్లేయర్స్

IPL 2021: ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రవర్తనతో అయోమయంలో ఫ్రాంచైజీలు.. బీసీసీఐకి ఫిర్యాదు