‘ఇదంత పెద్ద విషయమేమీ కాదు.. కేవలం సంచలనం కోసమే నాపేరు వాడారు’: నీరజ్ చోప్రా

|

Aug 26, 2021 | 7:34 PM

Neeraj Chopra: ఒలింపిక్ ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ జావెలిన్ పట్టుకోవడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మీడియాతోపాటు సోషల్ మీడియాలో ఈ రచ్చ మరీ ఎక్కువైంది.

ఇదంత పెద్ద విషయమేమీ కాదు.. కేవలం సంచలనం కోసమే నాపేరు వాడారు: నీరజ్ చోప్రా
Neeraj Chopra
Follow us on

Neeraj Chopra: ఒలింపిక్ ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ జావెలిన్ పట్టుకోవడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మీడియాతోపాటు సోషల్ మీడియాలో ఈ రచ్చ మరీ ఎక్కువైంది. దీంతో ఈ విషయంపై నీరజ్ చోప్రా స్పందించారు. “మేము మా వ్యక్తిగత జావెలిన్‌లను కలిసే ఉంచాము. వాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు. అతను నా జావెలిన్‌తో విసిరేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది పెద్ద విషయమేమీ కాదు,” అని నీరజ్ చెప్పుకొచ్చాడు. “సంచలనం చేయడానికే మీడియా నా పేరును ఉపయోగించింది. కానీ, ఇలాంటి వాటిని నాపేరు వాడొద్దని” నీరజ్ స్పష్టం చేశాడు.

అసలు ఏం జరిగిందంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో ఫైన‌ల్ స‌మ‌యంలో నీర‌జ్ చోప్రాకు.. పాకిస్తాన్‌ జావెలిన్‌ అథ్లెట్‌కు మధ్య జరిగిన ఓ విచిత్ర ఘటనను వెల్లడించాడు నీరజ్‌ చోప్రా. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త వైరల్‌ కావడంతో, ఆ పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ తీరును తప్పు బడుతూ నానా రచ్చ చేస్తున్నారు నెటిజన్స్‌. కాసేపట్లో టోక్యో ఒలింపిక్స్‌ ఫైనల్స్‌ జరగబోతుందన్న సమయంలో.. త‌న జావెలిన్ క‌నిపించ‌క‌పోవ‌డంతో నీర‌జ్ టెన్ష‌న్ ప‌డ్డాడు. త్రో సమ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో.. కంగారులో అటూఇటూ తిరిగాడు. కానీ పాకిస్థాన్ త్రోయ‌ర్ అర్ష‌ద్ న‌దీమ్ వ‌ద్ద త‌న జావెలిన్ ఉన్న‌ట్లు గ్ర‌హించిన నీర‌జ్ దాన్ని తీసుకున్నాడు. అయితే ఆర్షద్‌.. తీరును తప్పు బడుతూ.. నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాక్ అథ్లెట్ అర్ష‌ద్ ప్ర‌వ‌ర్తనా తీరును కూడా సోష‌ల్ మీడియా యూజ‌ర్స్ త‌ప్పుప‌డుతున్నారు. అయితే టెన్ష‌న్‌లో నీర‌జ్ త్రో చేసినా.. ఆ ఈవెంట్‌లో అత‌ను గోల్డ్ మెడ‌ల్ గెలవడం కూడా గొప్ప విషయమే అంటూ చెప్పుకొస్తున్నారు మరీ కొంతమంది నెటిజన్స్‌. అయితే ఈ నీరజ్‌ ఈ విక్టరీ సాధించిన తర్వాత.. నీరజ్‌కు కంగ్రాట్స్‌ చెబుతూ.. ట్వీట్‌ చేశాడు నదీమ్.

దీంతో ఈ విషయాన్ని మరింత పెద్దది చేయవద్దని నీరజ్ కోరాడు. ఇదంతా మీడియా వాళ్లు కావాలనే అలా రాసుకొచ్చారని ఆయన పేర్కొన్నాడు. మేము మంచి స్నేహితులుగానే ఉన్నాం అని, దయచేసి ఇంతటితో ఆ విషయాన్ని పక్కన పెడతారని కోరుకుంటున్నాను అని తెలిపాడు.

Also Read:

Rashid Khan: 3 ఫోర్లు, 2 సిక్సర్లు.. 300 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు.. మ్యాచ్‌కు హీరో అయ్యాడు..

IND vs ENG 3rd Test Day 2 Live: పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్.. జో రూట్ అర్ధ సెంచరీ..

Neeraj Chopra Meets Randeep Hooda: ఫేవరేట్ హీరోని కలుసుకున్న భారత స్టార్ అథ్లెట్..!