Neeraj Chopra: వరల్డ్ జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌ విడుదల.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ చేరుకున్న నీరజ్ చోప్రా.. ఎంతంటే?

|

Aug 12, 2021 | 7:51 PM

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ చేరుకున్నాడు.

Neeraj Chopra: వరల్డ్ జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌ విడుదల.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ చేరుకున్న నీరజ్ చోప్రా.. ఎంతంటే?
Neeraj Chopra
Follow us on

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు భారత అథ్లెట్ ప్రపంచ ర్యాకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. టోక్యో 2020లో భారతదేశం తరపున ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. దీంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించి పలు రికార్డులను నెలకొల్పాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత దేశానికి వ్యక్తిగత ఒలింపిక్‌ స్వర్ణ పతకాన్ని అందించి విజేతగా నిలిచాడు.

నీరజ్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరంలో విసిరి బంగారు పతకం సాధించాడు. ఈ ఫైనల్‌లో నీరజ్ రెండవ అత్యుత్తమ త్రో (87.03 మీ) విసిరి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జర్మనీకి చెందిన అథ్లెట్ జోహన్నెస్ వెట్టర్ తొలిస్థానంలో నిలిచాడు.

అదే సమయంలో భారతదేశ మరో అథ్లెట్ శివపాల్ సింగ్ రెండు స్థానాలు దిగజారి 20వ ర్యాంక్‌ను పొందాడు. శివపాల్ సింగ్ కూడా టోక్యోలో తన ఒలింపిక్ అరంగేట్రం చేశాడు. కానీ, ఫైనల్ చేరలేకపోయాడు.

పురుషుల జావెలిన్ త్రోలో టాప్ -100 లో భారత ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. రోహిత్ యాదవ్ (ప్రపంచ నం. 56), యశ్వీర్ సింగ్ (ప్రపంచ నం. 63), డీపీ మను (ప్రపంచ నం. 84) టాప్ 100లో చోటు దక్కించుకున్నారు.

జావెలిన్‌లో మహిళల జాతీయ రికార్డు హోల్డర్ అన్నూ రాణి ప్రస్తుతం ప్రపంచ నంబర్ 16వ స్థానంలో ఉంది. టోక్యో 2020 లో ఆమె ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది. కానీ, ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

Also Read: MS Dhoni Meets Vijay: మాస్టర్‌తో మిస్టర్ కూల్.. దళపతికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ధోని.. నెట్టింట్లో ఫ్యాన్స్ సందడి

Viral Video: గోల్ చేసేందుకు పరుగులు తీస్తున్న ఫుట్‌బాలర్స్.. హఠాత్తుగా గ్రౌండ్‌లోకి బాలుడి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?