Rajiv Gandhi Khel Ratna: ఖేల్ రత్న బరిలో కోనేరు హంపి.. అర్జున అవార్డులకు మరో ఏడుగురు: అఖిల భారత చెస్ సమాఖ్య

|

Jul 02, 2021 | 9:56 AM

భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న బరిలో ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ కోనేరు హంపి నామినేట్ అయింది. ఈమేరకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఐఏసీఎఫ్) ప్రకటించింది.

Rajiv Gandhi Khel Ratna: ఖేల్ రత్న బరిలో కోనేరు హంపి.. అర్జున అవార్డులకు మరో ఏడుగురు: అఖిల భారత చెస్ సమాఖ్య
Koneru Humpy
Follow us on

Rajiv Gandhi Khel Ratna: భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న బరిలో ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ కోనేరు హంపి నామినేట్ అయింది. ఈమేరకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఐఏసీఎఫ్) నేడు ప్రకటించింది. అలాగే మరో ఏడుగురు ప్లేయర్లను అర్జున అవార్డు కోసం నామినేట్ చేసినట్లు తెలిపింది. చెస్ లో అంతర్జాతీయంగా రాణించి, అతిచిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది. 2002 వసంవత్సరంలో కేవలం 15 ఏళ్ల కే గ్రాండ్ మాస్టర్ గా నిలిచి ఫేమస్ అయింది. దీంతో చదరంగం ఆటను జనాల్లోకి తీసుకెళ్లిన ఘనత హంపికే దక్కనుంది. మధ్యలో ఆటకు కొంత గ్యాప్ ఇచ్చింది. తరువాత 2019లో బరిలో నిలిచి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది. అలాగే 2022లో జరిగే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీకి హంపీ అర్హత సాధించింది. ప్రస్తుతం కోనేరు హంపీ ప్రపంచ 3వ ర్యాంక్ లో కొనసాగుతోంది. కాగా, 2020 ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ టైటిల్‌ గెలిచిన ఇండియన్ టీంలో కోనేరు హంపీ మెంబర్ గా ఉంది. హంపీతోపాటు అగ్రశ్రేణి ఆటగాళ్లైన భమిడిపాటి సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్‌ పేర్లను కూడా భారత బ్యాడ్మింటన్‌ సంఘానికి ఖేల్ రత్న అవార్డు కోసం నామినేట్ చేసింది.

మరోవైపు గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌బాబు, భక్తి కులకర్ణి, విదిత్‌ గుజరాతీ, సేతురామన్, పద్మిని రౌత్‌, అధిబన్ ల పేర్లను ఏఐసీఎఫ్‌ అర్జున అవార్డులకు నామినేట్ చేసింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్‌ కాంస్య పతకం సాధించాడు. కిదాంబి శ్రీకాంత్‌ 2017లో 4 సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు. ప్రణవ్‌ చోప్రా, ప్రణయ్, సమీర్‌వర్మల పేర్లను అర్జున అవార్డుల కోసం నామినేట్ చేసింది. వీరితో పాటు కోచ్‌లు మురళీధరన్‌, భాస్కర్‌బాబు లను దోణాచార్య అవార్డుకు నామినేట్ చేసింది. అలాగే లెరోయ్‌ డిసా, పీవీవీ లక్ష్మిలను ధ్యాన్‌చంద్‌ పురస్కారాలకు ప్రతిపాదించింది.

Also Read:

India vs Srilanka: టీమిండియా ఆటగాళ్ల ‘గెస్సింగ్‌ గేమ్‌’ షో.. ఆకట్టుకున్న శిఖర్, పృథ్వీషా..!

Jasprit Bumrah: భార్యతో నవ్వుతూ ఫొటోలు దిగడం కాదు.. ముందు వికెట్లు తియ్యు..! టీమిండియా పేసర్ పై నెటిజన్ల ట్రోల్స్..

Instagram Posts : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లు వీరే..! మీరు ఓ లుక్కేయండి..