Wimbledon Junior Champion 2021: వింబుల్డన్ లో జరిగిన జూనియర్ ఛాంపియన్ షిఫ్ టైటిల్ గెలుచుకుని భారత-అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు సమీర్ బెనర్జీ ఆదివారం చరిత్ర సృష్టించాడు. గంట 22 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల సమీర్ బెనర్జీ 7-5, 6-3 తేడాతో విక్టర్ లోలివన్ ఓడించాడు. ఈమేరకు సమీర్ బెనర్జీ తండ్రి కునాల్ బెనర్జీ ఓమీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ‘అవకాశం ఇస్తే.. భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తో మాట్లాడాలని సమీర్ కోరుకుంటున్నాడని’ ఆయన తండ్రి తెలియజేశాడు. లియాండర్ పేసే తన కెరీర్ ప్రారంభంలో సింగిల్స్ జూనియర్ వింబుల్డన్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ‘భారత్ లో ప్రజలు సమీర్ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని, ఈ మేరకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నతనంలో సమీర్ టెన్నిస్ తోపాటు ఫుట్ బాల్, బేస్ బాల్ ఆడేవాడు. సమీర్ టెన్నిస్ క్లబ్ లో ఆడడం చూసిన నా స్నేహితులు కొందరి సూచనల మేరకు టెన్నిస్ అకాడమీలో చేర్చామని, అలా తన టెన్నిస్ కెరీర్ ప్రారంభమైందని’ తెలిపారు.
ఐదేళ్ల వయసు నుంచే..
కునాల్ బెనర్జీ మాట్లాడుతూ,’కేవలం 5 సంవత్సరాల వయసు నుంచే సమీర్ న్యూజెర్సీలోని సెంటర్ కోర్ట్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ ప్రారంభించాడు. సబ్ జూనియర్ ఈవెంట్ లో వరుసగా టోర్నెమెంట్లు గెలుస్తూ వచ్చాడు. 2017లో అమెరికాలో జరిగిన అండర్ 14 వింటర్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను సమీర్ బెనర్జీ గెలుచుకున్నాడు. వీటితో పాటు సమీర్ తన ఆటను మెరుగుపరచడానికి ఫ్లోరిడా, ఫ్రాంక్ పర్డ్ లో నిరంతరం శిక్షణ పొందాడని’ పేర్కొన్నాడు.
రెండెళ్ల క్రితం జరిగిన ఐటీఎఫ్ టోర్నమెంట్ లో కూడా సమీర్ ఆడాడు. సమీర్ బంధువులలో చాలామంది కోల్‌కతాలో నివసిస్తున్నారు. 6 సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్న ప్రసిద్ధ సౌత్ క్లబ్ లో సమీర్ కొన్ని రోజులు ప్రాక్టీస్ కూడా చేశాడు. ‘సుమారు 35 సంవత్సరాల క్రితం నేను యూఎస్ వచ్చాను. చిన్నతనంలో నేను అస్సాంలో ఉండేవాళ్లం. అక్కడ మా నాన్న ఆయిల్ ఇండియాలో లిమిటెడ్ లో పనిచేశారు. ఆ తరువాత నేను ఐఐటీ ముంబైలో చదివి అమెరికా వచ్చానని’ సమీర్ తండ్రి తెలిపారు.
జూనియర్ ర్యాంకింగ్స్ టాప్-10లోకి సమీర్..
వింబుల్డన్ ప్రారంభానికి ముందు, ఐటీఎఫ్ జూనియర్ ఆటగాళ్ల ర్యాకింగ్స్ లో సమీర్ బెనర్జీ 19 వస్థానంలో ఉన్నాడు. ఈవిజయం తరువాత సమీర్ ప్రపంచంలోని టాప్ టెన్ జూనియర్ ఆటగాళ్లలో చేరనున్నాడు. అలాగే, సీనియర్ ఈవెంట్ లో క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లపై సమీర్ ప్రస్తుతం దృష్టి సారించాడు. అమెరికాలో జరిగే నేషనల్ హోర్డ్కోర్ట్ టోర్నమెంట్ టైటిల్ గెలుపొండాలని సమీర్ కోరుకుంటున్నాడు. ఈ టోర్నమెంట్ లో గెలిస్తేనే యూఎస్ ఓపెన్ లో ఆడేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. దాంతో ఈ టోర్నమెంట్ లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
“This was way beyond my wildest dreams.”
Samir Banerjee exceeds his own expectations with a title victory.#Wimbledon
— Wimbledon (@Wimbledon) July 11, 2021
Remember the name – Samir Banerjee ??
The American wins his first junior Grand Slam singles title by beating Victor Lilov in the boys’ singles final#Wimbledon pic.twitter.com/Xc3ueczg5m
— Wimbledon (@Wimbledon) July 11, 2021
Also Read:
Viral Video: ఇలా కూడా ఔటవుతారా.. చాలా అరుదైన రనౌట్ అంటూ నెటిజన్ల కామెంట్లు!