Tejaswin Shankar: గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న తేజస్విన్‌ శంకర్‌… ఈ టోర్నీలో మనోడికి రెండో స్వర్ణం

Indian High Jumper Wins Gold Medal: భారత అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ పురుషుల హైజంప్‌ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో జరుగుతున్న బిగ్‌–12 అవుట్‌డోర్‌ ట్రాక్‌....

Tejaswin Shankar: గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న తేజస్విన్‌ శంకర్‌... ఈ టోర్నీలో మనోడికి రెండో స్వర్ణం
Indian High Jumper Tejaswin

Updated on: May 17, 2021 | 4:09 PM

భారత అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ హైజంప్‌ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో జరుగుతున్న బిగ్‌–12 అవుట్‌డోర్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌లో 22 ఏళ్ల తేజస్విన్‌ కేన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు.

ఈ టోర్నీలో తేజస్విన్‌కిది రెండో స్వర్ణం. 2019లోనూ అతను పసిడి పతకం నెగ్గగా… 2020లో కరోనా కారణంగా టోర్నీ జరగలేదు. తమిళనాడుకు చెందిన తేజస్విన్‌ 2017లో అమెరికాకు వెళ్లి కేన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు అభ్యసిస్తూ అథ్లెటిక్స్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి: Encounter: బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. ఇరువర్గాల మధ్య కొసాగుతున్న ఎదురుకాల్పులు..!

Cyclone Tauktae Live: బీభత్సం సృష్టిస్తున్న ‘తౌక్టే’ తుఫాను.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు