Chess Player Donation For Covid: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆక్సిజన్, బెడ్లు కొరతతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని బయట పడేసేందుకు సెలబ్రిటీలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారులు విరాళాలు సేకరిస్తూ తమ వంతు కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చెస్ ప్లేయర్స్ కూడా మేము సైతం అంటూ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు భారత చెస్ స్టార్ ప్లేయర్స్ 50 వేల డాలర్లను.. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 37 లక్షలు వసూళు చేశారు. దేశాన్ని కరోనా నుంచి కాపాడే క్రమంలో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చెక్‌మేట్ కోవిడ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భాగమైన విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, రమేశ్ బాబు ఇతర చెస్ ప్లేయర్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించారు. ఇలా సేకరించిన మొత్తాన్ని రెడ్ క్రాస్ ఇండియాకు అందజేస్తామని ఏఐసీఎఫ్ తెలిపింది. ఇక ఈ దిగ్గజ చెస్ ప్లేయర్స్‌తో రెండు వేలలోపు ఫిడే రేటింగ్స్ ఉన్న చెస్ ప్లేయర్లు చదరంగం ఆడేందుకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా.. ఆనంద్‌తో ఆడాలంటే 150 డాలర్ల (రూ. 11 వేలు)ను… మిగిలిన నలుగురితో ఆడాలనుకుంటే 25 డాలర్ల (రూ.1,835)ను రిజిస్ట్రేషన్ రుసుముగా పెట్టింది. ఇందులో 105 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు.
Also Read: Gurugram Police thanks to Shikhar: దాతృత్వాన్ని చాటుకున్న గబ్బర్.. కోవిడ్ బాధితులకు మరోసారి సాయం
టీ 20 స్పెషలిస్ట్ బౌలర్ రిటైర్మెంట్..! అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు.. కారణం ఏంటో తెలుసా..?