న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా మాస్టర్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ చివరి అంకానికి చేరింది. 25 ఏళ్ల పికిల్ బాల్ ప్లేయర్ అర్మాన్ భాటియా వరుసగా మూడోసారి ఈ టోర్నమెంట్ ఫైనల్స్‌కి చేరాడు. అర్మాన్ భాటియా శనివారం నెదర్లండ్స్‌కు చెందిన రూస్ వాన్ రీక్‌తో కలిసి సెమీస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో విశాల్ మసంద్, సారా బర్ టీంను 11-5, 11-1తో ఓడించాడు. టోర్నమెంట్ చివరి రోజు(ఆదివారం) ఫైనల్స్‌లో అర్మాన్, రూస్.. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు జార్జ్ వాల్, డాని టౌన్‌సెండ్‌తో తలబడతారు. ఇందులో గెలిస్తే అర్మాన్ భాటియా టీం 50 వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ దక్కించుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో భాటియా, వాన్ రీక్ తమ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా డ్యూ కైట్లిన్ హార్ట్, మిచెల్ హార్గ్రీవ్‌లను చిత్తుగా ఓడించారు. ప్రారంభ గేమ్‌లో 11-1తో, రెండో గేమ్‌లో 11-6తో అద్భుత విజయాలను అందుకున్నారు.
ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
గత సెప్టెంబర్‌లో పికిల్‌బాల్‌లోకి అడుగుపెట్టిన అర్మాన్ భాటియా.. అతి తక్కువ వ్యవధిలోనే ఆటలో మాంచి ఫామ్ కనబరిచాడు. దేశీయ టోర్నమెంట్లలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన అర్మాన్ భాటియా.. అప్పుడప్పుడూ పికిల్‌బాల్ ఆటతో ముంబైలోని ఖార్ జింఖానా గ్రౌండ్స్‌లో ఆడుతుంటాడు. ‘ఆదివారం హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టాను. కచ్చితంగా గెలుపు నాదే’ అని ధీమా వ్యక్తం చేశాడు భాటియా. పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో, అర్మాన్ భాటియా.. యూఎస్ టాప్-సీడ్ డస్టీ బోయర్‌తో తలబడనున్నాడు.
ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్
ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..