Paris Olympics 2024, Day 4: నాలుగో రోజు బరిలోకి భారత అథ్లెట్లు.. పతకాలు ఏ ఈవెంట్‌లో రానున్నాయంటే?

|

Jul 30, 2024 | 6:49 AM

Paris 2024 Olympics, Day 4: 33వ సమ్మర్ ఒలింపిక్స్ జులై 26 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ గేమ్స్ ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటివరకు భారత్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. రెండో రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే, మూడవ రోజు భారతదేశం ఖాతాలో ఒక్క పతకం చేరలేదు. ఇప్పుడు నాల్గవ రోజు అంటే మంగళవారం భారత్‌కు పతకం వస్తుందని భావిస్తున్నారు.

Paris Olympics 2024, Day 4: నాలుగో రోజు బరిలోకి భారత అథ్లెట్లు.. పతకాలు ఏ ఈవెంట్‌లో రానున్నాయంటే?
Paris 2024 Olympics, Day 4
Follow us on

Paris 2024 Olympics, Day 4: 33వ సమ్మర్ ఒలింపిక్స్ జులై 26 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ గేమ్స్ ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్పటివరకు భారత్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. రెండో రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే, మూడవ రోజు భారతదేశం ఖాతాలో ఒక్క పతకం చేరలేదు. ఇప్పుడు నాల్గవ రోజు అంటే మంగళవారం భారత్‌కు పతకం వస్తుందని భావిస్తున్నారు. పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 నాలుగో రోజు జులై 30న, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు.

దీంతో పాటు భారత పురుషుల హాకీ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇది కాకుండా, భారత బాక్సర్లు కూడా బరిలోకి దిగనున్నారు. బ్యాడ్మింటన్, ఆర్చరీలో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజున భారత షెడ్యూల్‌ను చూద్దాం.

జులై 30న బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు..

12:30 – షూటింగ్ – ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్ డే 2 – పృథ్వీరాజ్ తొండైమాన్

ఇవి కూడా చదవండి

12:30 – షూటింగ్ – ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ డే 1 – శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి

13:00 – షూటింగ్ – 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ – ఇండియా 1 (మను భాకర్/సరబ్జోత్ సింగ్)

13:40 – రోయింగ్ – పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ – బాల్‌రాజ్ పన్వార్

16:45 – హాకీ – పురుషుల పూల్ B – భారతదేశం vs ఐర్లాండ్

17:14 – ఆర్చరీ – మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్ – అంకిత భకత్ vs వియోలేటా మైస్జోర్ (పోలాండ్)

17:53 – ఆర్చరీ – మహిళల వ్యక్తిగత 1/16 ఎలిమినేషన్ రౌండ్ – అంకిత భకత్ – (అర్హతకు లోబడి)

17:27 – ఆర్చరీ – మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్ – భజన్ కౌర్ vs సైఫా నురాఫిఫా కమల్ (ఇండోనేషియా)

17:53 – ఆర్చరీ – మహిళల వ్యక్తిగత 1/16 ఎలిమినేషన్ రౌండ్ – భజన్ కౌర్ – (అర్హతకు లోబడి)

17:30 – బ్యాడ్మింటన్ – పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ – సాత్విక్‌సాయిరాజ్ రెడ్డి/చిరాగ్ శెట్టి vs ఫజర్ అల్ఫియాన్/మహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా)

18:20కి ముందు కాదు – బ్యాడ్మింటన్ – మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ – తనీషా క్రాస్టో/అశ్విని పొన్నప్ప vs సెట్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)

19:00 – షూటింగ్ – ట్రాప్ పురుషుల ఫైనల్ – పృథ్వీరాజ్ తొండైమాన్ (అర్హతకు లోబడి)

19:16 – బాక్సింగ్ – పురుషుల 51 కేజీలు – ప్రిలిమినరీస్ – రౌండ్ ఆఫ్ 16 – అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా)

21:24 – బాక్సింగ్ – మహిళల 57 కేజీలు – ప్రిలిమినరీస్ – రౌండ్ ఆఫ్ 32 – జైస్మిన్ లంబోరియా vs నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్)

22:46 – ఆర్చరీ – పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్ – ధీరజ్ బొమ్మదేవర vs ఆడమ్ లి (చెక్ రిపబ్లిక్)

23:25 – ఆర్చరీ – పురుషుల వ్యక్తిగత 1/16 ఎలిమినేషన్ రౌండ్ – ధీరజ్ బొమ్మదేవర (అర్హతకు లోబడి)

01:22 – బాక్సింగ్ – మహిళల 54 కేజీలు – ప్రిలిమ్స్ – రౌండ్ ఆఫ్ 16 – ప్రీతి పవార్ vs యేని మార్సెలా అరియాస్ కాస్టానెడ (కొలంబియా)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..