Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్లో చరిత్ర సృష్టించాడు. మాంచెస్టర్ యునైటెడ్, అర్సినల్ మధ్య జరిగిన కీ ఫైట్‌లో రెండు గోల్స్ కొట్టిన రొనాల్డో.. తన జట్టును గెలిపించడమే కాదు.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. తన కెరీర్‌లో 800వ గోల్ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 1131 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో.. 801గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక క్లబ్ లీగ్స్ తరపున 485గోల్స్, పోర్చుగల్ తరపున ఆడిన మ్యాచ్‌ల్లో 115, కాంటినెంటల్‌లో 150, వివిధ మేజర్ టోర్నీల్లో 51గోల్స్ సాధించాడు.
ఇక అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య గుర్తించిన దాని ప్రకారం ఇప్పటివరకు అత్యధిక గోల్స్ చేసిన రికార్డు సాకర్ సూపర్ స్టార్, బ్రెజిల్ లెజెండ్ పీలే పేరు మీద ఉంది. పీలే తన కెరీర్ లో 765 గోల్స్ కొట్టగా.. రొనాల్డో 801 గోల్స్ చేశాడు.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!