Football Gallery Collapse: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు.. షాకింగ్ వీడియో..

|

Mar 20, 2022 | 3:59 PM

గాయపడిన వారిని వండూరు పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ముగ్గురిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.

Football Gallery Collapse: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కుప్పకూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు.. షాకింగ్ వీడియో..
Football Gallery Collapse
Follow us on

ఫుట్‌బాల్(Football) మైదానంలో ఘోర ప్రమాదం జరిగింది.కేరళలోని వండూర్‌ (Wandoor) లోని మల్లాపురం నగరంలో శనివారం రాత్రి జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందులో కొందరు గాయపడ్డారు. కలికావు-వాండూరు రోడ్డులో ఉన్న పుంగోడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండగా.. ఈ సెవెన్ ఫుట్‌బాల్ (Seven Football Match) మ్యాచ్ కోసం గ్యాలరీని నిర్మించారు. మ్యాచ్ జరగుతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు గాయపడ్డారు. ది హిందూ అనే ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం , గాయపడిన వారి పరిస్థితి అంత విషమంగా లేదు.

గాయపడిన వారిని వండూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ముగ్గురిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన రాత్రి 9:30 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పుడు గ్యాలరీలో 1000 మంది ఉన్నారు.

స్థానికుల ప్రకారం, మైదానంలోని గ్యాలరీని సరిహద్దు చెక్కతో తయారు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం కురుస్తుండడంతో ఈ గ్యాలరీ ఒత్తిడికి గురైంది. దీంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన పలువురికి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే, చాలామందికి మాత్రం అంత తీవ్రమైన గాయాలు కాలేదు.

ఈ ఘటనకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలో ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా గ్యాలరీ కూలిపోయింది. మైదానంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం జరిగిన నగరాన్ని ఫుట్‌బాల్ క్రేజీ సిటీ అని పిలుస్తారు. ఈ మ్యాచ్‌ను చూడటానికి వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇందులో పలువురు చిన్నారులు కూడా గాయపడ్డారు. నివేదిక ప్రకారం, సుమారు 200 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అయితే ఎవరి పరిస్థితి విషమంగా లేదు.

Also Read: Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?

IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?