FIFA World Cup 2026 : వరల్డ్‌కప్ ఫైనల్ గడ్డికీ బంపర్ డిమాండ్.. ఒక్క ముక్క ధర 2.6 లక్షల వరకు..!

FIFA World Cup 2026 : 2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మైదానంలోని అసలు గడ్డిని అభిమానుల కోసం కలెక్టిబుల్స్‌గా విక్రయించనున్నారు. ఒక్క ముక్క ధర రూ.39 వేల నుంచి రూ.2.6 లక్షల వరకు ఉండనుంది. అథెంటిసిటీ సర్టిఫికేట్‌తో పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

FIFA World Cup 2026 : వరల్డ్‌కప్ ఫైనల్ గడ్డికీ బంపర్ డిమాండ్.. ఒక్క ముక్క ధర 2.6 లక్షల వరకు..!
Fifa World Cup 2026

Edited By:

Updated on: Jul 15, 2026 | 7:48 PM

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ అభిమానులకు ఫిఫా అరుదైన అవకాశం కల్పిస్తోంది. 2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే మైదానంలోని అసలు గడ్డిని అధికారిక కలెక్టిబుల్స్‌గా విక్రయించనున్నట్లు వెల్లడైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత పిచ్‌లోని గడ్డిని ప్రత్యేకంగా భద్రపరచి అభిమానులకు అందించనుంది. వీటి ధరలు 450 డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.39 వేల నుంచి రూ.2.6 లక్షల వరకు ఉంటుంది.

2026 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ జూలై 19న న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరగనుంది. ఫైనల్ ముగిసిన అనంతరం మైదానంలోని గడ్డిని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి పారదర్శక అక్రిలిక్ బాక్స్‌లో భద్రపరుస్తారు. ప్రతి బాక్స్‌పై 2026 వరల్డ్‌కప్ లోగో, మ్యాచ్ వేదిక, తేదీ, ఫైనల్ స్కోరు వంటి వివరాలు ముద్రిస్తారు. అంతేకాదు, ఆ గడ్డి అసలైనదేనని ధృవీకరించే అథెంటిసిటీ ఫిల్మ్‌తో కూడిన యూఎస్‌బీ డ్రైవ్‌ను కూడా కొనుగోలుదారులకు అందజేయనున్నారు.
ఈ ప్రత్యేక కలెక్టిబుల్స్‌ను యూకేకు చెందిన Keep Stub సంస్థ తయారు చేస్తోంది. బేసిక్ ఎడిషన్ ధర 450 డాలర్లు కాగా, ప్రీమియం ఎడిషన్లు 900 డాలర్లు, 1,200 డాలర్లు, 3,000 డాలర్ల ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ధర విభాగంలో కేవలం 2,026 ముక్కలకే పరిమితం చేయడంతో వీటికి ప్రత్యేక విలువ ఏర్పడనుంది.

అన్ని కలెక్టిబుల్స్ విక్రయమైతే ఫిఫాకు ఈ కార్యక్రమం ద్వారా 11.2 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గడ్డి ముక్కలను ప్రత్యేక రెసిన్‌లో భద్రపరిచి వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన తర్వాత మాత్రమే కొనుగోలుదారులకు పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్ దేశాలకే డెలివరీలు పరిమితం చేయనున్నట్లు సమాచారం. అభిమానుల కోసం జ్ఞాపకంగా నిలిచిపోయే అరుదైన కలెక్టిబుల్‌గా ఫిఫా దీన్ని మార్కెట్‌లోకి తీసుకురానుంది.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us