AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. విండీస్ సిరీస్‌ నుంచి ఔట్..?

India vs West India T20I Series: అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించిన సంజూ సామ్‌సన్ (Sanju Samson)పై ఏషియన్ గేమ్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అక్కడ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 9 పరుగులే చేశాడు. పాకిస్థాన్‌తో ఫైనల్లోనూ కేవలం 2 పరుగులకే వెనుదిరగడంతో ఇప్పుడు వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో అతడి ప్లేయింగ్ ఎలెవన్ స్థానంపై సందేహాలు మొదలయ్యాయి.

ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. విండీస్ సిరీస్‌ నుంచి ఔట్..?
Asian Games 2027 Sanju Samson
Venkata Chari
|

Updated on: Oct 04, 2026 | 12:29 PM

Share

India vs West India T20I Series: భారత (India) టీ20 జట్టులో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో సంజూ శాంసన్ మరోసారి నిలకడలేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయడం, ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విఫలం కావడం అతడి కెరీర్‌లో తరచూ కనిపిస్తున్న అంశంగా మారింది. టీ20 ప్రపంచకప్ 2026లో మంచి ప్రదర్శన ఇచ్చిన అతడు, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. రెండు అర్ధసెంచరీలు సాధించడంతో ఏషియన్ గేమ్స్‌లో అతడి నుంచి మరింత ఆశించారు.

ఆ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం ప్రదర్శన రాలేదు. ఏషియన్ గేమ్స్ 2026లో సంజూ రెండు మ్యాచ్‌లు ఆడగా మొత్తం 9 పరుగులే చేశాడు. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో 7 పరుగులు చేసి నిరాశపరిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో పరిస్థితి మరింత నిరాశాజనకంగా మారింది.

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

ఇవి కూడా చదవండి

భారత్‌ కోసం నంబర్-3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. రెండు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ పెద్దగా స్పందించలేదు. ఆ మ్యాచ్‌లో కూడా 9 పరుగులకే పరిమితమయ్యాడు.

ఇప్పుడు భారత్‌ దృష్టి వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఉంది. అక్టోబర్ 6న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం మరికొందరు ఆటగాళ్లు కూడా జట్టులోకి తిరిగి రావడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజూ స్థానం మరింత పోటీకి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి అవకాశం దక్కే పరిస్థితి ఉందని తెలుస్తోంది. నంబర్-3 స్థానంలో ఇషాన్ కిషన్ (Ishan Kishan)ను తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఏషియన్ గేమ్స్‌లో అతడు తన సాధారణ స్థానానికి రెండు స్థానాలు దిగువగా, ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

ఇలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌కు తుది జట్టులో స్థానం దక్కడం అంత సులభంగా కనిపించడం లేదన్నది ప్రస్తుతం చర్చ. అఫ్గానిస్థాన్ సిరీస్‌లో చూపించిన ఫామ్‌ను కొనసాగించలేకపోవడం అతడికి ప్రతికూలంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
2 రోజులకే 15 లక్షలు.. కానీ మిథిలేష్‌కు చివరకు మిగిలేది ఎంతంటే?
2 రోజులకే 15 లక్షలు.. కానీ మిథిలేష్‌కు చివరకు మిగిలేది ఎంతంటే?