
ఫిఫా ప్రపంచ కప్ 2022 (FIFA WC 2022), గ్రూప్ దశలోని రెండవ రౌండ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల అనంతరం గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్‌కు చెందిన ఎంబాప్పే, ఈక్వెడార్‌కు చెందిన వాలెన్సియా ముందంజలో ఉన్నారు. అదే సమయంలో, గోల్డెన్ గ్లోవ్స్ రేసులో ముగ్గురు గోల్ కీపర్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక గణాంకాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. అత్యధిక గోల్ స్కోరర్ (టాప్-10)
| ఆటగాడు | దేశం | గోల్స్ |
| ఎనర్ వాలెన్సియా | ఈక్వెడార్ | 3 |
| కైలియన్ ఎంబప్పే | ఫ్రాన్స్ | 3 |
| లియోనెల్ మెస్సీ | అర్జెంటీనా | 2 |
| బుకాయో సాకా | ఇంగ్లండ్ | 2 |
| ఫెరాన్ టోర్రెస్ | స్పెయిన్ | 2 |
| మెహదీ తరేమి | ఇరాన్ | 2 |
| ఆలివర్ గిరాడ్ | ఫ్రాన్స్ | 2 |
| రీకార్లిసెన్ | బ్రెజిల్ | 2 |
| కోడి గాక్పో | నెదర్లాండ్స్ | 2 |
2. అత్యధిక గోల్ సేవ్ చేసిన ప్లేయర్స్ (టాప్-5)
| ఆటగాడు | దేశం | గోల్ సేవ్స్ |
| ఫెజెన్సీ | పోలాండ్ | 8 |
| శుచి గొండా | జపాన్ | 8 |
| మిలన్ బోర్జన్ | కెనడా | 8 |
| ఆండ్రీస్ నాపర్ట్ | నెదర్లాండ్స్ | 7 |
| మిలింకోవిచ్ | సెర్బియా | 7 |