Watch Video: ఒక్క మ్యాచ్‌తో ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలు.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఫిఫా ఛాంపియన్‌గా సౌదీ అరేబియానే..
SA vs ARG: ఫిఫా ప్రపంచ కప్ 2022లో సౌదీ అరేబియా 2-1తో అర్జెంటీనాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో సౌదీ అరేబియా ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2022లో సౌదీ అరేబియా భారీ కలకలం సృష్టించింది. అలాగే తన పేరిట సరికొత్త రికార్డులను సృష్టించింది. మంగళవారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లో సౌదీ అరేబియా 2-1తో అర్జెంటీనాపై విజయం సాధించింది. అర్జెంటీనా స్టార్, లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్ ప్రారంభ క్షణాల్లో గోల్ చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో అర్జెంటీనా మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ విజయంతో సౌదీ అరేబియా ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
అర్జెంటీనా-సౌదీ అరేబియా మ్యాచ్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి..
- 1990 తర్వాత ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఓడించిన తొలి యూరోపియన్‌యేతర జట్టుగా సౌదీ అరేబియా నిలిచింది.
- ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఓడించిన చివరి మూడు జట్లు ప్రపంచకప్ టైటిల్‌ను (జర్మనీ 2014, ఫ్రాన్స్ 2018) గెలుచుకున్నాయి లేదా ఫైనల్‌కు చేరాయి (క్రొయేషియా, 2018).
- అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 4 విభిన్న ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఐదో ఫుట్‌బాల్ ఆటగాడిగా నిలిచాడు.
- ఈ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ FIFA ప్రపంచ కప్ 2006, FIFA ప్రపంచ కప్ 2014, FIFA ప్రపంచ కప్ 2018, FIFA ప్రపంచ కప్ 2022లో గోల్స్ చేశాడు.
- జులై 2019 తర్వాత అర్జెంటీనా మొత్తం 36 మ్యాచ్‌ల తర్వాత ఓటమిని ఎదుర్కొంది.
- అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ ఆంటోనియో కార్బజల్ (మెక్సికో), లోథర్ మాథ్యూస్ (జర్మనీ), రఫెల్ మార్క్వెజ్ (మెక్సికో) తర్వాత ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొన్న నాల్గవ ఆటగాడిగా నిలిచాడు.
- మెస్సీ ఇప్పటివరకు 2006, 2010, 2014, 2018, 2022 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగాడు.
షాకిచ్చిన సౌదీ అరేబియా..
Biggest upset of #FIFAWorldCup2022. Saudi Arabia beats Argentina.#ARGSAU #SAvsARG #SaudiArabia pic.twitter.com/9n5r9ibo5p
ఇవి కూడా చదవండి— Javed Iqbal (@JavedIqbalReal) November 22, 2022
అర్జెంటీనాను ఓడించి సౌదీ అరేబియా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్‌లో 1-0తో వెనుకంజలో నిలిచిన సౌదీ అరేబియా అద్భుతంగా పునరాగమనం చేసింది. సౌదీ తరపున సలేహ్ 48వ నిమిషంలో గోల్ చేశాడు. అదే సమయంలో 53వ నిమిషంలో సేలం అల్దావస్రీ గోల్ చేసి సౌదీ అరేబియాకు ఆధిక్యాన్ని అందించి మ్యాచ్‌ను 2-1తో గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..