Saudi Arabia: అర్జెంటీనాను ఓడించిన సౌదీ ఆటగాళ్లకు ఖరీదైన గిఫ్ట్.. విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

|

Nov 26, 2022 | 4:39 PM

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌లో సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనాపై అద్భుత విజయం సాధించింది. అర్జెంటీనాపై విజయం తర్వాత సౌదీ అరేబియా ఆటగాళ్లపై కానుకల వర్షం కురుస్తోంది. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఒక్కో ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.

Saudi Arabia: అర్జెంటీనాను ఓడించిన సౌదీ ఆటగాళ్లకు ఖరీదైన గిఫ్ట్.. విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Fifa World Cup 2022 Saudi Arabia
Follow us on

ఫిఫా ప్రపంచకప్‌లో సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనాపై సౌదీ అరేబియా సాధించిన విజయం ప్రస్తుత టోర్నీలో అతిపెద్ద ఓటమిగా పరిగణిస్తున్నారు. సౌదీ అరేబియా తొలిసారి అర్జెంటీనాను ఓడించడం గమనార్హం. ఇంతకుముందు, రెండు జట్ల మధ్య మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగగా, ఇందులో అర్జెంటీనా రెండు మ్యాచ్‌లు గెలిచింది. కాగా రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

అర్జెంటీనాపై సౌదీ అరేబియా సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పటికీ నెట్టింట్లో హల్‌చల్ సృష్టిస్తూనే ఉంది. ఈ విజయంతో వారు ప్రపంచ కప్‌లో చివరి 16కి చేరుకునే మంచి అవకాశం ఉంది. సౌదీ అరేబియా ఆటగాళ్లు నాకౌట్ రౌండ్‌కు చేరుకోగలరా లేదా అనేది తరువాత విషయం. అయితే అర్జెంటీనాపై విజయం సాధించిన తర్వాత ఈ ఆటగాళ్లపై వరాల వర్షం కురుస్తోంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఒక్కొక్కరికి ఒక ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ కారు పేరు రోల్స్ రాయిస్ ఫాంటమ్. దీని ధర 500000 యూరోలు (దాదాపు రూ. 4.25 కోట్లు). ఇది ఒక విలాసవంతమైన కారు. ఇది 48-వాల్వ్ V12 ఇంజిన్‌తో గ్యాసోలిన్ ఇంజెక్షన్‌తో 460 HP (338 kW) ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. 720 న్యూటన్-మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5.7 సెకన్లలో 0 నుంచి 100 km/h (62 mph) వేగాన్ని అందుకోగలదు.

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా సెలవు..

సౌదీ అరేబియా విజయం తర్వాత, జట్టు అభిమానులు చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈ గ్రాండ్ విక్టరీకి సంబంధించి దేశమంతా ఇప్పటికీ పండుగ వాతావరణం నెలకొంది. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బుధవారం (నవంబర్ 23) సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెలవు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులతో పాటు విద్యార్థులందరికీ కూడా వర్తించేలా ప్రకటించారు.

సౌదీ అరేబియాపై ఓటమి తర్వాత, అర్జెంటీనా జట్టుకు చెందిన ప్రత్యేక రికార్డు కూడా తేలిపోయింది. వాస్తవానికి, లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని ఈ జట్టు గత 36 మ్యాచ్‌లలో అజేయంగా ఉంది. ఇందులో ఇటలీ పేరిట అత్యధికంగా 37 మ్యాచ్‌ల్లో ఓడిపోని రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టలేకపోయింది.

నేడు పోలాండ్‌తో సౌదీ అరేబియా పోరాటం..

సౌదీ అరేబియా అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్‌లతో పాటు గ్రూప్ సిలో ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా వచ్చే మ్యాచ్‌ల్లో మెక్సికో, పోలాండ్‌తో తలపడనుంది. ఈరోజు (నవంబర్ 26) పోలాండ్‌తో పోటీ పడాల్సి ఉంది. సౌదీ అరేబియా పోలాండ్‌ను చిత్తు చేస్తే ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరే అవకాశాలు బలంగా మారుతాయి. ఇక అర్జెంటీనా జట్టు గురించి చెప్పాలంటే మెక్సికోతో తలపడాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..