FIFA World Cup 2022: నాకౌట్ దశ మ్యాచ్‌ల్లో కీలక మార్పులు.. అసలు కారణం ఏంటంటే?
గ్రూప్-స్టేజ్ తర్వాత మొత్తం 16 జట్లు రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంటాయి. మొదటి రెండు రౌండ్‌ల మ్యాచ్‌ల మాదిరిగా కాకుండా, ఈసారి ప్రతి గ్రూప్‌లోని నాలుగు జట్లు తమ చివరి మ్యాచ్‌ను వేర్వేరు సమయాల్లో నిర్వహించడం లేదు.
ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఫిఫా ప్రపంచ కప్ 2022 గ్రూప్-స్టేజ్‌లో చివరి రౌండ్ మ్యాచ్‌లు జరగుతున్నాయి. ఆ తర్వాత నాకౌట్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ దశలో మూడవ, చివరి మ్యాచ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి నాలుగు రోజుల్లో నాలుగు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. అదే సమయంలో, ఆ తర్వాత మొత్తం 16 జట్లు రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంటాయి. మొదటి రెండు రౌండ్‌ల మ్యాచ్‌ల మాదిరిగా కాకుండా, ఈసారి ప్రతి గ్రూప్‌లోని నాలుగు జట్లు తమ చివరి గేమ్‌ను రెండు వేర్వేరు సమయాల్లో కాకుండా.. ఒకే టైంలో నిర్వహించనున్నారు.
ఫిఫా ఈ నిర్ణయం తర్వాత ఏం జరుగుతుందంటే?
నెదర్లాండ్స్, ఖతార్‌తో పాటు సెనెగల్, ఈక్వెడార్ మధ్య మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇది కాకుండా, ప్రతి రోజు ఒకే గ్రూపులో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు మ్యాచ్‌లు రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే, ఫుట్‌బాల్ అభిమానులు దీనిపై తమ అభిప్రాయాన్ని నిరంతరం తెలియజేస్తున్నారు. అయితే, ఫిఫా ఎందుకు ఇలా చేస్తుందంటే దీని వెనుక ఓ కారణం ఉంది. వాస్తవానికి, ఇది ఏ జట్టుకు అనవసర ప్రయోజనం పొందకుండా చేసేందుకనే తెలుస్తోంది.
ఫిఫా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఇలా చేయడం వల్ల ఏ జట్టుకు అనవసర ప్రయోజనం ఉండదని FIFA అభిప్రాయపడింది. ఎందుకంటే మ్యాచ్‌లు వేర్వేరు సమయాల్లో జరిగితే, రెండు జట్లకు అర్హత సాధించాలంటే ఆయా జట్లు ఏమి చేయాలో తెలుసుకుంటారు. అయితే మొదటి మ్యాచ్ ఆడే జట్లకు అది ఉండదు. అయితే, రెండు మ్యాచ్‌లు ఒకే సమయంలో జరగడంతో, క్వాలిఫికేషన్ కోసం రియల్ టైమ్ మార్పులపై నాలుగు జట్లు తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..