Euro 2020: ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తరువాత యూరో కప్ సెమీస్ చేరింది. నిన్న ఉక్రెయిన్ తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ టీం దూకుడు ప్రదర్శించి 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా యూరో కప్ టైటిల్ సాధించలేకపోయింది. యూరో కప్ లో చివరిసారి 1996లో సెమీ ఫైనల్ చేరినా.. ఫైనల్ చేరలేకపోయింది. అంతకు ముందు 1966 ప్రపంచకప్ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4-2తో గెలిచింది. అయితే, 1966 మ్యాచ్ తరువాత 4 గోల్స్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ టీం డెన్మార్క్‌తో పోరాడుతుంది. సెమీ ఫైనల్స్ బుధవారం నుంచి జరగనున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇటలీ, స్పెయిన్ ల మధ్య బుధవారం జరగనుంది. అలాగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం జరగనుంది. ఈరెండు సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్లు సోమవారం జరిగే ఫైనల్స్ లో తలపడతాయి.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ ఆటగాడు కెప్టెన్ హ్యారీ కేన్ ఆట 4 వ నిముషం, 50 వ నిముషంలో 2 గోల్స్ చేశాడు. అలాగే మరో ఆటగాడు. మగురె 46వ నిముషంలో, హెండర్సన్ 63వ నిముషంలో చేరో గోల్స్ చేశారు. దీంతో ఇంగ్లండ్ టీం 4-0 తేడాతో ఉక్రెయిన్ జట్టును ఓడించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించగా.. ఉక్రెయిన్ జట్టు ఏ దశలోనూ ఇంగ్లండ్ ప్లేయర్లను అడ్డుకోలేకపోయింది. ఉక్రెయిన్ పై గెలుపుతో ఇంగ్లండ్ టీం 62 వసారి యూరో కప్ బరిలో నిలిచి, మూడవ సారి సెమీఫైనల్ కు చేరుకుంది.
62nd appearance for England ?
1st goal for the Three Lions ⚽️??????? Unforgettable moment for Jordan Henderson! @JHenderson | @England | #EURO2020 pic.twitter.com/4Naa6kJ6Yk
— UEFA EURO 2020 (@EURO2020) July 3, 2021
EURO 2020 semi-finals set ✅
????? Italy vs Spain
?????????? England vs DenmarkWho are you backing to lift the ?❓#EURO2020 pic.twitter.com/SjjvZ6PSAb
— UEFA EURO 2020 (@EURO2020) July 3, 2021
Also Read: