బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2022)ప్రారంభానికి ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మికి డోప్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీంతో 4×100 మీటర్ల రిలేలో భారత అథ్లెటిక్ జట్టు పతకం సాధించే అవకాశాలు అత్యంత తక్కువగా మారాయి. ధనలక్ష్మి గతేడాది 100 మీటర్ల రేసులో ద్యుతీ చంద్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. దీంతో పాటు గత నెలలో ధనలక్ష్మి 200 మీటర్ల పరుగులో హిమదాస్‌పై విజయం సాధించింది.
సమాచారం ప్రకారం, ధనలక్ష్మి శాంపిల్‌ను డోప్ టెస్ట్ కోసం AIU తీసుకుంది. ధనలక్ష్మి నమూనాలో స్టెరాయిడ్లు కనుగొన్నారు. దీంతో ధనలక్ష్మిపై ప్రస్తుతానికి నిషేధం విధించడంతో పాటు ఆమె కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో పాటు యుగెన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా ధనలక్ష్మిపై నిషేధం విధించింది.
ఈ విభాగంలో కూడా..
గతేడాది భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ధనలక్ష్మి పాల్గొంది. 400 మీటర్ల రిలే రేసులో హిమ దాస్, ద్యుతీ చంద్‌తో పాటు ధనలక్ష్మి జట్టులో పాల్గొంది. ధనలక్ష్మి 100 మీటర్ల విభాగంలో రిలే రేసుతో పాటు భారతదేశం నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వెళుతోంది.
మీడియా కథనాల ప్రకారం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ధనలక్ష్మి అమెరికాకు వెళ్లలేదు. ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు ధనలక్ష్మి పేరును తొలగించారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ధనలక్ష్మిని అనుమతించలేదని కూడా స్పష్టమైంది. అటు ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు కూడా డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. ఐశ్వర్య బాబు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..