BWF World Championship 2021: క్వార్టర్ ఫైనల్లో ముగిసిన సింధు ప్రయాణం.. ఇక పురుషుల పోరుపైనే పతకం ఆశలు..!

|

Dec 17, 2021 | 3:39 PM

PV Sindhu: 2019లో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది.

BWF World Championship 2021: క్వార్టర్ ఫైనల్లో ముగిసిన సింధు ప్రయాణం.. ఇక పురుషుల పోరుపైనే పతకం ఆశలు..!
Bwf World Championship 2021 Pv Sindhu
Follow us on

BWF World Championship 2021: స్పెయిన్‌లో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ కీలక మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన తై త్జు యింగ్ భారత స్టార్ ప్లేయర్‌ సింధును వరుస సెట్లలో ఓడించింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తాయ్ 21-17, 21-13తో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి నలుగురు ఆటగాళ్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. సింధుతో పాటు కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సింధు ఓటమితో మహిళల సింగిల్స్‌లో భారత్‌ సవాల్‌ ముగిసినప్పటికీ పురుషుల సింగిల్స్‌పై ఇంకా ఆశలు ఉన్నాయి. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఈ ముగ్గురు ఆటగాళ్లు రానున్నారు.

Also Read: Watch Video: సరదా.. సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!

Kohli-Sachin: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ.. ఒక్క అడుగు దూరంలో నిలిచిన టెస్ట్ సారథి.. అదేంటంటే?