కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC).. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఓఎన్‌జీసీ సెక్టార్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, స్టోర్ కీపర్, మెషినిస్ట్, సర్వేయర్, వెల్డర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, మెకానిక్ డీజిల్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కింద ఆయా సెక్టార్లలో మొత్తం 2236 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు విభాగాన్ని బట్టి పదో తరగతి, పన్నెండో తరగతి అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్ 25, 2024 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 25, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతల్లో మెరిట్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తుది ఫలితాలను నవంబర్ 11, 2024వ తేదీన వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది కాలం పాటు శిక్షణ ఉంటుంది. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,050, ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,000 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఎంపికైన వారు దేహ్రాదూన్, దిల్లీ, జోధ్‌పుర్, గోవా, హజీరా, ముంబయి, ఉరాన్, పన్వెల్, నవా, అహ్మదాబాద్, అంక్లేశ్వర్, వడోదర, బొకారో, కాంబే, మెహసానా, జోర్హాట్, నజీరా & శివసాగర్, సిల్చార్, చెన్నై, కాకినాడ, కారైకల్, రాజమండ్రి, అగర్తల, కోల్‌కతా వర్క్ సెంటర్‌లలో పని చేయవల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.