New Zealand: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కివీస్‌ స్టార్‌ ఆటగాడు..

|

Dec 30, 2021 | 8:03 AM

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల తర్వాత టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న 39 ఏళ్ల టేలర్‌

New Zealand: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కివీస్‌ స్టార్‌ ఆటగాడు..
Follow us on

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల తర్వాత టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న 39 ఏళ్ల టేలర్‌.. ఆతర్వాత ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌ల అనంతరం క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియాద్వారా ప్రకటించాడు. ‘ ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరిగే వన్డేల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నాను. గత 17 ఏళ్ల అద్భుతమైన ఇన్నింగ్స్‌కు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఇంత సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’ అని టేలర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

కాగా 2006వ సంవత్సరంలో వెస్టిండీస్‌తో మెక్లీన్ పార్క్‌లో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు రాస్‌ టేలర్‌. ఇప్పటివరకు 233 వన్డేల్లో 48.18 సగటుతో 8,576 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలున్నాయి. ఇక 109 టెస్టుల్లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించి 45.37 యావరేజ్‌తో 7, 577 రన్స్‌ చేశాడు. ఇందులో 19 సెంచరీలున్నాయి. 290 అత్యధిక స్కోరు. అదేవిధంగా 102 అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు ఆడి 1, 909 పరుగులు సాధించాడు. కాగా ఈ స్టార్‌ బ్యాటర్‌ మరో రెండు టెస్టులు ఆడనున్నాడు. కాగా ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు టేలర్‌.

Also Read:

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీలో కీలక మార్పులు.. హోస్ట్‌గా వ్యవహరించేది నాగ్‌ కాదా.. ఆ క్రేజీ యాంకరేనా.?