వన్డేల్లో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తానంటోన్న ర‌హానే..

వన్డేల్లో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇండియా క్రికెటర్​ అజింక్యా రహానే. మూడు ఫార్మాట్లోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవ‌డం కోసం మానసికంగా రెడీ అవుతున్న‌ట్లు తెలిపాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:13 pm, Sat, 11 July 20
వన్డేల్లో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తానంటోన్న ర‌హానే..

వన్డేల్లో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇండియా క్రికెటర్​ అజింక్యా రహానే. మూడు ఫార్మాట్లోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకోవ‌డం కోసం మానసికంగా రెడీ అవుతున్న‌ట్లు తెలిపాడు. వ‌న్డేల్లో ఓపెనింగ్​ లేదా నెం.4 స్థానంలో ఆడటానికి రెడీగా ఉన్న‌ట్లు తెలిపాడు.

ప్ర‌జంట్ వ‌న్డేల్లో నెం.4 స్థానంలో ముంబై ప్లేయ‌ర్ ​శ్రేయస్​ అయ్యర్​ ఆడుతున్నాడు. ఓపెనింగ్​ జోడిగా రోహిత్​ శర్మ, శిఖర్​ ధావన్ ఉన్న సంగ‌తి తెలిసిందే.​ మూడో స్థానంలో సార‌థి కోహ్లీ ఉన్నారు. కాగా కెరీర్​ మొత్తం 65 టెస్టులు ఆడాడు రహానే. అయితే వన్డే జ‌ట్టులో ప్ర‌జంట్ అత‌డికి ప్లేసు ద‌క్క‌లేదు.  ఇక దాదాపు నాలుగేళ్ల నుంచి టీ20 టీమ్ కు దూరంగా ఉన్నాడు.