ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఐసీసీ షాక్!

పాకిస్థాన్‌తో బ్రిస్టల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్‌ రేటు నమోదైనందుకు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్‌ పై ఐసీసీ ఒక వన్డే నిషేధం విధించింది. అంతేకాక మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత కూడా విధించింది. జట్టులోని మిగతా ఆటగాళ్లకి మ్యాచ్‌ ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఓవర్లు ఆలస్యంగా బౌలింగ్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోని ఐసీసీ మందలించింది. మ్యాచ్‌లోని 29వ […]

ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఐసీసీ షాక్!

Edited By:

Updated on: May 15, 2019 | 7:04 PM

పాకిస్థాన్‌తో బ్రిస్టల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్‌ రేటు నమోదైనందుకు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్‌ పై ఐసీసీ ఒక వన్డే నిషేధం విధించింది. అంతేకాక మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత కూడా విధించింది. జట్టులోని మిగతా ఆటగాళ్లకి మ్యాచ్‌ ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఓవర్లు ఆలస్యంగా బౌలింగ్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోని ఐసీసీ మందలించింది. మ్యాచ్‌లోని 29వ ఓవర్‌లో తాను ఔట్ కాగా.. బెయిర్‌స్టో వికెట్లను తన బ్యాట్‌తో కొట్టాడు. దీంతో ఐసీసీ బెయిర్‌స్టోకి డిసిప్లినరీ రికార్డులో ఒక పాయింట్ కలిపింది.