టీ20 మ్యాచ్‌లంటేనే విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలకు పెట్టింది పేరు. మొదటి నుంచి సిక్స్‌లు, ఫోర్లు ఇక్కడ సర్వసాధారణం. ఇందుకు తగ్గట్లే న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్‌లో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సంచలనం సృష్టించాడు. సెంట్రల్ స్టాగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 65 బంతుల్లో 11ఫోర్లు,11 సిక్స్‌లతో 141 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. బ్రేస్‌వెల్ విధ్వసంక బ్యాటింగ్‌తో సెంట్రల్ స్టాగ్స్‌పై 2 వెల్లింగ్టన్ 2వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాగా పుకేకురా పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సెంట్రల్ స్టాగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు ఈక్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది సెంట్రల్ స్టాగ్స్. విజయం కోసం 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెల్లింగ్టన్ 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక పరాజయం తథ్యం అనుకున్న సమయంలో బరిలోకి దిగిన కెప్టెన్ బ్రేస్‌వెల్ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 65 బంతుల్లో 141 పరుగులు చేశాడు. దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో వెల్లింగ్టన్ విజయం సాధించింది. కాగా సూపర్ స్మాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగత అత్యధిక స్కోర్ బ్రేస్‌వెల్‌దే కావడం విశేషం. అదే విధంగా అతడి టీ-20 కేరిర్‌లో ఇదే తొలి సెంచరీ.
The sound off the bat! ?
Michael Bracewell looking to tee off after a horror start for the Firebirds. Firebirds 38/4 (4.2) Watch play LIVE on @sparknzsport or free-to-air on @TVNZ 1 LIVE scoring https://t.co/v49vrPn7pO #WEAREWELLINGTON #SuperSmashNZ pic.twitter.com/RXCJkmL49h
— Cricket Wellington (@cricketwgtninc) January 8, 2022
Also Read:
Coronavirus: ప్రపంచ దేశాలపై పంజా విసురుతోన్న కరోనా.. వివిధ దేశాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలివే..
Anantapur: మహిళా కానిస్టేబుల్‌ను బలిగొన్న లైంగిక వేధింపులు.. సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు..
Jason Roy: తండ్రైన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్.. కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..