FIFA World Cup 2022: మ్యాచ్ చూస్తూనే ఆపరేషన్ చేయించుకున్న ఫుట్‌బాల్ అభిమాని.. దానిపై ఆనంద్ మహింద్రా ఏమన్నాడంటే..?

|

Dec 08, 2022 | 5:15 PM

ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అభిమానంతో కాకుండా దానిపై ఉన్న పిచ్చితో చూసేవారు, మ్యాచ్‌లో జరిగే యాక్షన్ సీన్ల కోసం కూడా చూసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడం కోసం.. ఓ వ్యక్తి ఏం చేశాడంటే..?

FIFA World Cup 2022: మ్యాచ్ చూస్తూనే  ఆపరేషన్ చేయించుకున్న ఫుట్‌బాల్ అభిమాని.. దానిపై ఆనంద్ మహింద్రా ఏమన్నాడంటే..?
Ungoing Surgery And Anand Mahindra
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ నడుస్తోంది. దానికి కారణమేమిటో మీకూ తెలుసు కదా.. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓ సారి జరిగే ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తమ అభిమాన టీమ్ కప్ గెలుచుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటుంటాడు. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అభిమానంతో కాకుండా దానిపై ఉన్న పిచ్చితో చూసేవారు, మ్యాచ్‌లో జరిగే యాక్షన్ సీన్ల కోసం కూడా చూసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడం కోసం పోలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన సాహసమేమిటో తెలిస్తే మీరు ఒక్క సారిగా షాక్ అవుతారు. అవును అతను ఏం చేశాడంటే తనకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కూడా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ను చూస్తూనే ఉన్నాడు. అతను గత నెల 25న వేల్స్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు ఈ సహసం చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. పోలాండ్‌లోని కీల్స్‌లో గత నెల 25న.

అయితే తన కోరిక మేరకు ఆపరేషన్ థియేటర్‌లో టీవీని ఏర్పాటు చేసినందుకు సదరు డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఘటనకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశాడు. అవి క్రమక్రమంగా వైరల్ అవుతుండడంతో అందరూ షేర్ చేస్తూ వచ్చారు. అయితే అదే క్రమంలో మన దేశానికి చెందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా కంట పడ్డాయి వైరల్ అవుతోన్న ఆ ఫొటోలు. వాటికి ఆయన చమత్కారంగా స్పందించారు. అంతేకాక ఆ ఫొటోలను ఆయన కూడా షేర్ చేస్తూ.. ‘‘హే ఫిఫా.. ఇతను కూడా కప్ అందుకునేందుకు అర్హుడేనని నువ్వు అనుకోవడం లేదా..?’’ అని కాప్షన్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఆనంద్ మహింద్రానే కాకుండా పలువురు నెటిజన్లు కూడా ఈ ఫొటోలకు తమ తమ స్పందనలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ ఆపరేషన్ చేయించుకున్న అతను వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇది వెర్రి కాకపోతే.. ఇంకేమిటి..?’ అని రాశాడు. ఇంకో నెటిజన్..‘ పిచ్చి ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి ఉండకూడదు’ అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇలా నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..