IPL 2025: లక్నోకు ఊహించని షాక్.. మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లాప్ ప్లేయర్?

|

Oct 27, 2024 | 11:01 AM

IPL 2025 KL Rahul: IPL 2022 వేలానికి ముందు, లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను రూ. 17 కోట్లకు కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలో ఎల్‌ఎస్‌జీ తరపున ఆడిన రాహుల్ ఈసారి మళ్లీ వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.

1 / 6
లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరలో జరగనున్న ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనడం ఖాయం. LSG ఫ్రాంచైజీ ఇచ్చిన ఆఫర్‌ను రాహుల్ తిరస్కరించాడని, అందుకే అతను మెగా యాక్షన్‌లో కనిపిస్తాడని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

2 / 6
ఇక్కడ లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను కేవలం ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని భావించినట్లు తెలిసింది. అయితే, దీనికి రాహుల్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను వదులుకోవాలని నిర్ణయించుకుంది.

3 / 6
గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా కనిపించిన కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. కానీ, అతని నాయకత్వంలో జట్టు నిరంతర వైఫల్యాలను చవిచూసింది. దీని కారణంగా, గత సీజన్‌లో SRHతో జరిగిన మ్యాచ్ తర్వాత, రాహుల్‌ను LSG జట్టు యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగా విమర్శించినట్లు తెలుస్తోంది.

4 / 6
ఆ తర్వాత, కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్‌ను విడిచిపెట్టబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ, కేఎల్ రాహుల్ సంజీవ్ గోయెంకాతో కనిపించడం ద్వారా అన్ని పుకార్లకు ముగింపు పలికాడు. అంతే కాకుండా ఇటీవల గోయెంకా కూడా కేఎల్ రాహుల్ మా కుటుంబంలో భాగమని అన్నారు.

5 / 6
ప్రస్తుతానికి, కేఎల్ రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ ఒప్పందానికి సిద్ధంగా లేరని స్పష్టమైంది. దీంతో ఐపీఎల్ మెగా వేలానికి ముందే కెప్టెన్‌ను జట్టు నుంచి తప్పించాలని ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు సమాచారం.

6 / 6
దీని ప్రకారం ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్ కనిపించడం దాదాపు ఖాయం. మరి ఈ వేలం ద్వారా కేఎల్ రాహుల్ ఏ జట్టులో భాగమవుతారో చూడాలి.