IPL 2022 retentions: మా ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.. లక్నోపై పంజాబ్‌, హైదరాబాద్‌ ఫ్రాంఛైజీల ఫిర్యాదు..

|

Nov 30, 2021 | 12:10 PM

మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌-2022 రీటెన్షన్  ప్రక్రియ ప్రారంభంకానుంది . ఏ జట్టు ఏ ఆటగాడిని రీటైన్‌ చేసుకుంటుందో, ఎవరిని వదులుకుంటుందో, ఏ ఆటగాడు ఎక్కువ ధర

IPL 2022 retentions: మా ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.. లక్నోపై పంజాబ్‌, హైదరాబాద్‌ ఫ్రాంఛైజీల ఫిర్యాదు..
Follow us on

మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌-2022 రీటెన్షన్  ప్రక్రియ ప్రారంభంకానుంది . ఏ జట్టు ఏ ఆటగాడిని రీటైన్‌ చేసుకుంటుందో, ఎవరిని వదులుకుంటుందో, ఏ ఆటగాడు ఎక్కువ ధర పలుకుతాడో అన్న అంశాలు క్రీడాభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. కాగా ఐపీఎల్- 2022లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్‌ జట్లు ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌ రీటెన్షన్ ప్రారంభం కానుండగా కొత్తగా వచ్చిన లక్నో ఫ్రాంఛైజీపై వస్తోన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ (పంజాబ్ కింగ్స్‌), రషీద్‌ ఖాన్‌ (సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌)లను లక్నో ఫ్రాంఛైజీ ప్రలోభాలకు గురిచేస్తోందని, వారి జట్లను విడిచేలా నిబంధనలకు విరుద్ధంగా ఆటగాళ్లతో చర్చలు సాగిస్తున్నాయంటూ పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఫిర్యాదు చేశాయి. ఇందుకోసం ఆయా ఆటగాళ్లకు భారీ మొత్తంలో నగదు చెల్లించేందుకు లక్నో ప్రయత్నిస్తోందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాయి.

నిజమైతే కఠిన చర్యలు..
కాగా ఈ ఆరోపణలపై బీసీసీఐకు చెందిన ఓ సీనియర్‌ అధికారి స్పందించారు. ‘ కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ వారి ఫ్రాంచైజీలను వీడేలా లక్నో అనైతిక చర్యలకు పాల్పడుతుందని పంజాబ్, హైదరాబాద్ మా దృష్టికి తీసుకొచ్చిన మాట వాస్తవమే. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. కేవలం నోటి మాట ద్వారా మాత్రమే ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకు వచ్చాయి. మేం దీనిపై దృష్టిసారించాం. మేం ఈ ఆరోపణలపై సీరియస్‌గా దృష్టి సారిస్తాం. అనైతిక చర్యలకు పాల్పడ్డారని నిరూపితమైతే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఆటలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటే పర్వాలేదు. కానీ.. ప్రలోభాలకు గురిచేస్తే మాత్రం సహించం’ అని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. కాగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు) అందుకున్న ఘనత ఈ స్టార్‌ క్రికెటర్‌ సొంతం సొంతం. ఇక మిస్టరీ స్పిన్నర్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు రషీద్‌ఖాన్‌.

Also Read:

IND vs NZ: రెండో టెస్టుకు రహానేపై వేటు పడనుందా!.. హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ ఏమంటున్నారంటే..

515 పరుగులు, ఆపై 11 వికెట్లు.. ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఎవరో తెలుసా?

Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..