శ్రీశాంత్ నిరీక్షణకు ఫలితం.. త్వరలోనే ఎంట్రీ

| Edited By:

Jun 18, 2020 | 5:54 PM

మ్యాచ్‌ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని క్రికెట్‌కి దూరమైన పేసర్ శ్రీశాంత్‌ నిరీక్షణకు త్వరలో ఫలితం దక్కనుంది. అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం ఈ సెప్టెంబర్‌లో పూర్తి కానుండగా..

శ్రీశాంత్ నిరీక్షణకు ఫలితం.. త్వరలోనే ఎంట్రీ
Follow us on

మ్యాచ్‌ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని క్రికెట్‌కి దూరమైన పేసర్ శ్రీశాంత్‌ నిరీక్షణకు త్వరలో ఫలితం దక్కనుంది. అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం ఈ సెప్టెంబర్‌లో పూర్తి కానుండగా.. కేరళ క్రికెట్ అసోషియేషన్(KCA)నుంచి అవకాశం లభించింది. కేరళ రంజీ జట్టులో శ్రీశాంత్‌ను తీసుకోవాలని కేసీఏ సిద్ధపడింది. అయితే ఆ లోపు శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కేసీఏ సెక్రటరీ మాట్లాడుతూ సుశాంత్ పునరాగమనంతో తమ జట్టు బలపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌ని 2013 మేలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘ విచారణల అనంతరం ఢిల్లీ స్పెషల్ కోర్టు 2015లో సుశాంత్‌ని నిర్ధోషిగా ప్రకటించింది. అయితే బీసీసీఐ మాత్రం జీవితకాల వేటును ఎత్తివేయలేదు. ఇక దీనిపై గతేడాది సుప్రీం కోర్టు స్పందిస్తూ శిక్షాకాలం తగ్గించాలని బీసీసీఐకి సూచించింది. ఈ క్రమంలో ఆయనపై విధించిన జీవిత కాల నిషేధం 7ఏళ్లకు కుదించగా.. అది ఈ సెప్టెంబర్‌లో ముగియనుంది.

ఇక ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ.. నాకు మళ్లీ అవకాశం ఇచ్చిన కేరళ క్రికెట్ సంఘానికి కృతఙ్ఞతలు. కేసీఏకు రుణపడి ఉంటాను. నా ఫిట్‌నెస్ నిరూపించుకొని మళ్లీ ఆటలో చెలరేగుతా అని అన్నారు.

Read This Story Also: ‘హిట్ మ్యాన్’ అమ్మాయిగా పుట్టింటే.. చాహల్ షేర్ చేసిన ఫొటో చూశారా..!